అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘లవ్ స్టోరీ’కి సంబంధించి తాజా అప్ డేట్ వచ్చేసింది. ప్రేమికుల రోజున ఈ లవ్ స్టోరీకి కూడా ఓ అప్ డేట్ ఉంటే మంచిదన్న ఆలోచన శేఖర్ కమ్ములకు వచ్చినట్టుంది. ఈ సినిమాలోని ‘నీ చిత్రం చూసి..నా చిత్తం చెదిరి నే చిత్తరువైతి రయ్యో..’ లిరికల్ వీడియోని ఈ ఉదయం 10.08 గంటలకు విడుదల చేశారు. శేఖర్ కమ్ముల సినిమాలన్నీ ఓ ప్రత్యేకమైన జోనర్ లో ఉంటాయి. గత నెలలో ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. 10.08 గంటలు అనే సమయం వీరు సెంటిమెంటుగా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. టీజర్ ను కూడా ఇదే సమయానికి విడుదల చేశారు.
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలు. ఇంతకుముందు ‘ ఏ పిల్లా పరుగున పోదామా’ పాటను విడుదల చేశారు. శేఖర్ కమ్ముల ‘ఫిదా’లాంటి విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ సంగీతం సమకూర్చారు. ఏప్రిల్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Muist Read ;- బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య
Let’s celebrate love every single day .. here’s #NeeChitramChoosi from #LoveStoryhttps://t.co/rZrgR2pcYl
@pawanch19@anuragkulkarni_#MittapalliSurendar@Sai_Pallavi92 @sekharkammula @SVCLLP #AmigosCreations @AsianSuniel @adityamusic @niharikagajula pic.twitter.com/Sq1sQFd1EP— chaitanya akkineni (@chay_akkineni) February 14, 2021