అక్కినేని నాగచైతన్య – సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సాంగ్స్ కు అనూహ్యమైన స్పందన రావడంతో లవ్ స్టోరీ మూవీ రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని సాయిపల్లవి సారంగ ధరియా.. పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. చేస్తుందో తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ పాట రికార్డుల మోత మ్రోగిస్తుంది.
ఈ పాట విడుదలైన నెల రోజుల్లోనే 10 కోట్ల వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. అతి తక్కువ కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇప్పుడు 250 మిలియన్ వ్యూస్ అనగా 25 కోట్ల వ్యూస్‌తో ఇంకా జోరు కొనసాగిస్తోంది. సినిమా విడుదలకు ముందే వ్యూస్‌తో రికార్డులు సృష్టించిన అతి తక్కువ సినిమా పాటల్లో సారంగ దరియా ఒకటిగా నిలిచింది. దీనికి పవన్ సి.హెచ్ స్వరాలందించారు. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ తెలంగాణ జానపదానికి.. మంగ్లీ స్వరం.. సాయి పల్లవి నృత్యం కలిసి ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఈ సినిమాను ఏప్రిల్ 16న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయడంతో సినిమా విడుదలకు రెడీ అవుతుంది. లవ్ స్టోరీ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. మజిలీ, వెంకీమామ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన చైతన్య లవ్ స్టోరీ మూవీతో హ్యాట్రిక్ సాధిస్తాడని ఆశిద్దాం.
Must Read ;- TITLE లవ్ స్టోరీ వెనక రియల్ స్టోరీ ఇదే!