చైతూ, సాయిపల్లవిల లవ్ స్టోరీ క్లైమాక్స్ కు వచ్చేసింది. ఈరోజు ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెల 24న థియేటర్లోనే సినిమా విడుదలవుతోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల ట్రేడ్ మార్క్ మరోసారి కనిపించింది.
నాగ చైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన రేవంత్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపించాడు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో స్థిరపడాలనుకుంటూనే డ్యాన్సర్ రేవంత్ గా చూపించడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.
మరో వైపు బీటెక్ పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనికగా సాయి పల్లవిని కనిపించింది. అయితే.. మౌనికలో దాగి ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ ని గుర్తిస్తాడు రేవంత్. ఆమెను మంచి డ్యాన్సర్ అవ్వాలని ప్రోత్సహిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడడం.. ఆ స్నేహం ప్రేమగా మారడం జరుగుతుంది. ఒక ప్రేమ అంటే అడ్డంకులు మామూలే కదా. వీరి ప్రేమకు కూడా అడ్డంకులు ఏర్పడడం.. ఆ అడ్డంకులను దాటుకుని వీళ్లు ఎలా ఒకటయ్యారనేదే ఈ సినిమా అనుకోవాలి. చైతన్య తెలంగాణ యాసలో మాట్లాడడం బాగుంది. అలాగే సాయిపల్లవి కూడా పాత్రకు తగ్గట్టుగా అదరగొట్టేసింది.
మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా.. బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని చద్దాం వంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మిడిల్ క్లాస్ యువకుడిగా నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మీద నమ్మకాన్ని ఈ ట్రైలర్ పెంచిందనే చెప్పవచ్చు.
Must Read ;- సీటీమార్ (రివ్యూ)











