ఆయన పేరులో లక్కీ ఉండటమో ఏమో గానీ నిజంగా ఆయన లక్కీ అలీనే. ఇండి-పాప్ రంగంలో లక్కీ అలీ స్టయిలే వేరు. పాప్ సింగర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు.
తొలి ఆల్బమ్ సునో తోనే ఆయన పేరు ఓ సంచలనం. తాజాగా ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు.. ఇప్పుడు ఆయన పేరు మరింతగా వెలిగిపోతోంది. దానికి కారణం ఆయన పాడిన ఓ సనమ్ పాట. ఆయన మళ్లీ ఇలా తళుక్కుమనడంతో నెటిజన్ల ఆనందానికి అవధులు లేవు. ఆ పాటవిని, ఆయనను చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. లక్కీ అలీకి ఇప్పుడు 63 ఏళ్లు. ఆయన గిటార్ వాయిస్తూ ఓ సనమ్ పాట పాడుతుంటే నెటిజన్లు తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ పాట విని తమ ట్వీట్లతోనే జనం జేజేలు కొడుతున్నారు.

సంగీత ప్రపంచంలో లక్కీ అలీ పెద్ద మాస్టరే. ప్రముఖ గాయకుడు మహమూద్ కుమారుడిగా లక్కీ అలీ అందరికీ తెలుసు. అతన్ని నటుడిని చేద్దామని మహమూద్ అనుకున్నారట. కానీ లక్కీ అలీ సంగీతాన్ని ఎన్నుకున్నాడు. ఆయన స్వేచ్ఛా జీవి. అతను ఏడో తరగతి తప్పాడంటే ఎవరైనా నమ్మగలరా? తన అభిరుచులను చంపుకోలేక క్లాసులకు డుమ్మాకొట్టేవాడట. సైన్యంలో కూడా చేరాలనుకున్నారు.
పొలంలో ప్రశాంత జీవనం సాగిస్తూ ఉంటారాయన. గొర్రెపిల్లలను మేపుకుంటూ తన సంగీతంతో ప్రకృతిలో మమేకమవుతుంటారు లక్కీ అలీ. చాలా కాలం తర్వాత ఆయన పాట వినగానే నెటిజన్లు గతంలోకి వెళ్లిపోయారు. ఆయన 90 దశకంలోని గాయకుడు. ఆనాటి పాటల్లోకి మరోసారి వెళ్లిపోయారు. లక్కీ అలీ పాటను సాద్ ఖాన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్ట్ అనే ట్విట్టర్ లో కనపించింది. దాంతో ఈ పాట వైరల్ అయ్యింది. ఈ పాట వ్యూస్ లక్షల్లో పెరిగిపోతున్నాయి.
Also Read ;- బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ మెడకు డ్రగ్స్ ఉచ్చు
#LuckAli singing ‘o sanam’. What are your favourite Lucky Ali songs? pic.twitter.com/mBc4msHKuY
— Bollywoodirect (@Bollywoodirect) November 13, 2020