‘దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రాలతో టాలీవుడ్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ‘పుష్పక విమానం’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొత్త కుర్రోడు దామోదర తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీని.. కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్స్ , టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని సిలకా అనే పాటను ..ఆనంద్ అన్న విజయ్ దేవరకొండ విడుదల చేశాడు.
సిలకా ఎగిరిపోయావా? ఆశలన్నీ ఇడిసేసి ఎనకా అంటూ సాగే ఈ పాటను రామ్ మిరియాల ట్యూన్ చేయడమే కాకుండా.. మరో గీత రచయిత ఆనంద్ గుర్రంతో కలిసి సాహిత్యాన్ని కూడా అందించారు. ఇక ఈ లిరికల్ సాంగ్ లో చమన్ బ్రదర్స్ పేరుతో మ్యూజిక్ బ్యాండ్ తో రామ్ మిరియాల, కొరియో గ్రాఫర్ రఘు మాస్టర్ కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే వివాహ వ్యవస్థపై తెరకెక్కిన ‘పుష్పక విమానం’ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. మరి ఆనంద్ కు ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- ఉప్పెనను విజయ్ దేవరకొండతో అనుకున్నారట!











