భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు..
కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర వాతావరణంలో జరుగుతున్న శివరాత్రి వేడుకలకు భక్తులు పోటెత్తారు. వేకుజామునుంచే శైవక్షేత్రాలకు భక్తులు బారులుతీరారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరింపించి.. మొక్కులు తీర్చుకుంటున్నారు. రెండు తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామాలు, కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సప్త నదుల సంగమేశ్వరుని ఆలయం, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మక్త్యాల శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం, కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారి ఆలయం, అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం, పెదకాకాని, దైదా, సత్రశాల, చేజర్ల,క్వారీ, గోవాడ, చిలుమూరు వంటి పలు శైవ క్షేత్రాలకు భక్తుల పెద్దఎత్తున తరలివచ్చి, మొక్కులు తీర్చుకున్నారు. అలానే తెలంగాణలోని పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయం, కూసుమంచి గణపేశ్వరాలయం, తీర్థాల సంగమేశ్వరాలయం, మధిర మృత్యంజయేశ్వర స్వామి వారి ఆలయం, వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి, ఐనవోలు మల్లిఖార్జునస్వామి ఆలయం, సోమశిల శ్రీ లలితా సోమేశ్వర ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివరాత్రి ప్రత్యేక పూజలు జరిపించారు. విశేషాలంకరణలో కొలువుదీరిన స్వామి వారిని దర్శించి, తన్మయత్వం పొందారు. రాత్రంతా జాగరం చేసి, పరమేశ్వరుని నామస్మరణ చేయనున్నారు భక్త కోటి.
Must Read:-ఆకట్టుకుంటోన్న శివరాత్రి లుక్