నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే విజయం సాధించింది కీర్తి సురేష్. యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఆమె అందం, అభినయంతో మెప్పించడంతో.. అలనాటి నటి సావిత్రి పాత్రను పోషించే అద్భుత అవకాశం దక్కించుకుంది. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అంతకంటే బాగా ఇంకెవరు నటించలేరేమో అనేంతగా నటించింది. జాతీయ అవార్డ్ సైతం దక్కించుకుంది. దీంతో కీర్తి సురేష్.. కి డిమాండ్ బాగా పెరిగింది. బాలీవుడ్ నుంచి సైతం ఆఫర్స్ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు ప్రస్తుతం టెన్షన్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటారా..? సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’లో నటిస్తుంది. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ సినిమాని డిసెంబర్ నుంచే స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అలాగే అమెరికాలో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించాలి అనుకున్నారు. అయితే.. అక్కడ కరోనా ఇంకా తగ్గకపోవడం.. వీసాలు ఇంకా రాకపోవడంతో హైదరాబాద్ లోనే షూటింగ్ ప్లాన్ చేసారు. డిసెంబర్ నుంచి కాకుండా జనవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టాలి అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్త’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇందులో మీనా, నయనతార కూడా నటిస్తున్నారు. అయితే.. రజనీ రాజకీయ పార్టీ పెట్టబోతుండడంతో ‘అన్నాత్త’ సినిమాని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు. డిసెంబర్ లో హైదరాబాద్ లో షూటింగ్ కి ఓకే చెప్పారట. అందుచేత ‘అన్నాత్త’ చిత్ర నిర్మాతలు.. కీర్తి సురేష్ ని డిసెంబర్, జనవరిలో డేట్స్ ఇమ్మాన్నారట. ఒక వైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మరో వైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్త’ మూవీలో జాయిన్ కావాలి.
ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్స్ తో నటించే అవకాశం రావడం.. ఆనందం కలిగిస్తున్నప్పటికీ… డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి రావడంతో కాస్త టెన్షన్ ఫీలవుతుందట. అదీ.. సంగతి.
Must Read ;- ఎన్టీఆర్ కు జోడీగా కీర్తి సురేష్ వైపే త్రివిక్రమ్ మొగ్గు