మలైకా అరోరా .. యూత్ లో ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అభిమానులు ఆమెను అమరలోకానికి దారితప్పిన అప్సరస అనే అనుకుంటారు. కాస్త కుదురుగా నిలబడితే ఆమె అందానికి హారతులు పడదామనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు .. ఎందుకంటే ఆమె అందం నేలపై నడిచే సమయాలు తక్కువ .. ఆకాశంలో మెరిసే సందర్భాలు ఎక్కువ. తన నివాసం మనుషుల మధ్య కాదు .. మంచుకొండల్లో .. మనసు దోచే బీచ్ లలో అన్నట్టుగా ఆమె తన దూకుడు చూపుతుంటుంది. ఆమె అందానికి మంచుకొండలు కరిగి మహాసముద్రలుగా మారిపోయాయేమోననే డౌట్ కూడా ఒక్కోసారి కలుగుతూ ఉంటుంది.

మలైకా అరోరా ఎప్పుడూ కూడా కొత్తగా కనిపించాలని కోరుకుంటుంది .. అందుకు ఆమె దగ్గరున్న ఏకైక ఆయుధం అందమే .. ఏకైక మంత్రమూ అందమే. అందాలపై అదుపులేని తనం .. పొదుపు లేనితనం ఆమెకి ఇష్టం. అందాలను బంధించి ఉక్కిరిబిక్కిరి చేయడం పాపమని ఆమె భావిస్తుందేమో .. వాటికి కావలసిన స్వేచ్ఛను అందించడమే తన విధిగా పెట్టుకుంటుంది. వంటిపై ఉన్న వస్త్రాలన్నీ దానం చేసినట్టుగా ఎవరూ లేని ఏకాంతంలో బికినీతో తను దిగే పోటోలను సమ్మోహన అస్త్రాలుగా సంధిస్తుంది .. పడుచు రాజ్యాలపై దండయాత్రలు చేస్తుంది.

తమలపాకులు .. తామరాకులు .. అరటిఆకులు .. ఇలా తన అందాన్ని ఆవిష్కరించడానికి ప్రకృతిలో దేనినీ వదిలిపెట్టని ధోరణి ఆమెలో కనిపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ నుంచి మహా సముద్రం వరకూ తన అందాలను విస్తరింపజేయడంలో ఉత్సాహాన్ని చూపుతుంది. ‘న్యూ ఇయర్’ ఎంజాయ్ మెంట్ లో భాగంగా ‘గోవా’లో ఆమె దిగిన ఫోటోలే అందుకు నిదర్శనం. వయసుతో పాటు ఆమె గ్లామర్ కూడా పెరుగుతుందనడానికి ఈ ఫోజులే ఒక ఉదాహరణ.

ఆమె స్విమ్మింగ్ పూల్ లో ఉంటే అక్కడే సునామీ పుడుతుందేమోననేది కుర్రాళ్ల భావన. ఆమె అందాలను అందుకోవడానికే కెరటాలు తీరం వైపుకు పరిగెత్తు కొస్తున్నా యేమోననేదని వాళ్ల ఆలోచన. తడిసిన ఆమె అందాలు బీచ్ లోని ఇసుక తిన్నెలను వేడెక్కిస్తున్నాయేమోననేది వాళ్ల సందేహం. కుర్రాళ్ల ఊహలు .. ఉత్సాహాలు అలాగే ఉంటాయ్ మరి .. కాదనడానికి మనమెవరం చెప్పండి.











