కోవీషీల్డ్, కోవ్యాక్జిన్, స్పుత్నిక్.. లాగా ఇదో కొత్త వ్యాక్సిన్ అయితే కాదు. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’లో కెవ్వుకేక పుట్టించిన మలైకా ఐటమ్ వ్యాక్సిన్ ఏమిటో తెలుసుకుందాం.
ఈ బాలీవుడ్ శృంగార తార మలైకా అరోరా తను ఈ వైరస్ నుంచి కోలుకోడానికి ఏం తోడ్పడిందో తెలిపింది. అదే సంకల్ప బలం అట. దాన్ని మించిన గొప్ప వ్యాక్సిన్ ఇంకేదీ ఉండదని ఆమె అంటోంది. మలైకా చెప్పే ఈ స్పెషల్ ‘ఐటమ్’ సంగతేంటో చూద్దాం. ఆమెకిప్పుడు 48 ఏళ్లు. మగవాడి జీతం ఆడదాని వయసు తెలుసుకోవడం తప్పే అయినా తప్పదు మరి. అయినా మలైక్ ఫిట్ నెస్ విషయంలో యమస్ట్రాంగ్. ప్రతిరోజూ ఎక్సర్ ‘సైజు’లే ఆమెను అంత బలంగా ఉంచుతున్నాయి.
గత ఏడాది సెప్టెంబరులో ఆమెకు కరోనా సోకింది. రెండు వారాలకు కోలుకుంది. ఆ సమయంలో తను చేసిన వ్యాయామాలే తనను దీన్నుంచి గట్టెక్కించాయని ఆమె అంటోంది. అందరూ అన్నట్లుగానే తను అదృష్టవంతురాలినేనని ఆమె అంగీకరిస్తోంది. తన జీవితంలో ఎన్నో సంఘటనలకు లక్ కారణమట. ఒక్కోసారి ఆ లక్ మనల్ని వరించదు అంటోంది. ‘కోవిడ్ నుంచి కోలుకోవడం ఈజీ అని ఎవరైనా చెబితే వారికి కచ్చితంగా వైరస్‌ను ఎదుర్కొనేంత ఇమ్యూనిటీ ఉండాలి. లేదా వారికి కొవిడ్‌తో పోరాటం మీద అవగాహన లేకపోయి ఉండాలి’ అంటోందామె.
కోవిడ్ తనకు సోకినప్పుడు తను చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది. ఇంట్లో నడవడం కూడా భారంగా అనిపించిందట. చాలా శక్తిని కోల్పోయిందట. వైరస్ సోకి 10 నెలలు గడిచినా నీరసం ఏ మాత్రం తగ్గలేదట. శారీరకంగానూ మానసికంగానూ చాలా ఇబ్బంది పడినట్టు చెప్పింది. ధైర్యం చేసి వర్కవుట్లు చేయడానికి సిద్ధపడ్డట్టు చెప్పింది. ఇప్పటికీ ఆ వ్యాయామాలను కంటిన్యూ చేస్తున్నానని వివరించింది. ఆశ మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుందని, జీవితంలో దానిని కోల్పోకూడదని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది.
తన ఫిట్‌నెస్ చిట్కాలను ప్రతి రోజూ తన అభిమానులతో ఆమె పంచుకుంటోంది. ఈమె టోన్డ్ బాడీ వెనుక వ్యాయామం, యోగా ఉన్నాయనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె మలైకా అయినా, అది జమైకా అయినా కరోనా వైరస్ కు ఒక్కటే.. అందుకే ఆమెను ఒక్క చూపు చూసింది. దానికి మలైకా కూడా గట్టి సమాధానమే చెప్పింది. అదన్నమాట సంగతి.
Must Read ;- హాట్ హాట్ గా వడ్డిస్తున్న శృంగార తార











