చూడగానే భలే ఉంది అనిపించే ముంబై బ్యూటీ మాళవికా శర్మ. ఈ అమ్మడు మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. చూసి కొద్దీ చూడాలనిపించే ఈ భామ కుర్రకారును బాగానే ఆకట్టుకుంది కానీ.. తొలి ప్రయత్నం నేల టిక్కెట్టు ఫ్లాప్ అయ్యింది. తొలి ప్రయత్నం ఫెయిల్ అయినా.. ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది.

రెడ్ మూవీలో రామ్ సరసన నటించింది. ఈ సినిమా పై మాళవికా చాలా ఆశలు పెట్టుకుంది. అయితే.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెడ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడుకి కెరీర్ గురించి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా ట్రాక్ లోకి రాని కెరీర్ ని ట్రాక్ లో పెట్టాలంటే.. చేతిలో సక్సస్ అయినా ఉండాలి లేదంటే నిత్యం వార్తల్లో అయినా ఉండాలి.

ఈ కిటుకు కనిపెట్టింది అనుకుంట.. మాళవికా హాట్ షోటో షూట్ చేయించి.. ఆ స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. కుర్రకారును ఆకట్టుకుని.. కేక పుట్టిస్తోంది. ఈ అమ్మడు స్టిల్స్ చూస్తుంటే.. అందాల ఆరబోతకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెబుతుంది. మరి.. గ్లామర్ తో ఛాన్స్ లు దక్కించుకుంటుందో..? లేదో..? చూడాలి.
Must Read ;- గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీనే.. కానీ











