మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ఒక సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. పొట్టదగ్గర బలమైన గాయం తగలడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రిలో ప్రవేశపెట్టారు. ‘కళ’ అనే సినిమా లోని ఒక ఫైట్ చిత్రీకరణ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. కాలేయానికి అతి సమీపంలో గాయమైందని డాక్టర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో జాయిన్ చేసిన వెంటనే ఆ గాయం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో .. ఐసియూలో 72 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు వారు తెలిపారు.
మలయాళంలో విలన్ పాత్రలనుంచి హీరోగా ఎదిగాడు టోవినో థామస్. అతి తక్కువ సమయంలోనే విలక్షణమైన నటుడిగాపేరు తెచ్చుకున్నాడు. ధనుష్ ‘మారి 2’ లో విలన్ గా నటించిన టోవినో.. ఈ మధ్య ఆహాలో విడుదలైన ‘ఫోరెన్సిక్, అండ్ ది ఆస్కార్ గోస్ టు’ సినిమాలతో తెలుగువారికి కూడా సుపరిచితుడయ్యాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితికి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నారు.











