ఈ జెనరేషన్ హీరోలు .. తెరమీద తాము నిజంగానే హీరోలుగా కనిపించాలని తపిస్తుంటారు. ఆ కారణం చేతనే ఏమోగానీ.. డూప్స్ లేకుండానే యాక్షన్ సీన్స్ లో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ క్రమంలో పలువురు హీరోలు గాయాలు పాలవుతున్నారు. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు కొత్తగా ఓ మలయాళ హీరో కూడా చేరాడు. అతడి పేరు ఫహద్ ఫాజిల్. మాలీవుడ్ మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ ఎక్స్ ట్రార్డినరీ యాక్టర్ అతడు. ప్రస్తుతం ఈ హీరో .. ‘మలయన్ కుంజు’ అనే మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. దీనికి అతడి తండ్రి, వెటరన్ డైరెక్టర్ ఫాజిల్ నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.
మలయన్ కుంజు సినిమా షూటింగ్ సందర్భంగా ఒక సీన్ చిత్రీకరణ జరుగుతుండగా.. ఫాజిల్ కు పెద్దగాయమైందని సమాచారం. ఈ సినిమాలో ఇల్లు కూలిపోయే సన్నివేశం ఒకటుందట. ఆ సంఘటన జరుగుతుండగా.. హీరో తప్పించు కోవాలి. అయితే టైమింగ్ తప్పడంతో .. ఫహద్ ఫాజిల్ లోపల ఉండిపోయాడట. దాంతో అతడి ముక్కుకు పెద్ద గాయమైందట. చిత్ర బృందం సకాలంలో స్పందించి వెంటనే అతడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారట. అతడి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు కానీ.. గాయం నుంచి కోలుకోడానికి కొద్ది రోజులు పడుతుందట. ఈ సంఘటన జరిగిన తర్వాత అభిమానులు, మలయాళ సినీ ప్రముఖులు ఫహద్ ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు.
Must Read ;- ఆదిపురుష్ కు ఆదిలోనే హంసపాదు