కొంతమంది కథానాయికలు ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాదు. కానీ మరికొంతమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే సంచలనంగా మారతారు. అలాంటి కథానాయికల జాబితాలో ‘ప్రియా ప్రకాశ్ వారియర్‘ ఒకరుగా కనిపిస్తుంది. ‘ఒరు అడార్ లవ్’ అనే మలయాళ సినిమాలో కాటుక కళ్లతో మత్తెక్కిస్తూ .. కనుబొమలతో విన్యాసాలు చేస్తూ ఈ అమ్మాయి యూత్ కి నిద్ర లేకుండా చేసింది. అప్పట్లో టీనేజర్ల నోటిలో ఈ అమ్మాయి పేరు తియ్యగా నానింది.

‘ఒరు ఆదార్ లవ్’ సినిమా హిట్ అయ్యుంటే ఈ అమ్మాయి కథ వేరేగా ఉండేది. కానీ మలయాళంలోనే కాదు, అనువాదాలుగా అడుగుపెట్టిన ఇతర భాషల్లోను ఈ సినిమా పరాజయం పాలైంది. దాంతో కెరియర్ పై ఈ అమ్మాయి పెట్టుకున్న ఆశ పాలపొంగే అయింది. అయితే వరుస అవకాశాలు .. పెద్ద హిట్లు లేకపోయినా ఈ అమ్మాయిని ఎవరూ మరిచిపోకపోవడం విశేషం. ఇటు అభిమానుల్లోను .. అటు ఇండస్ట్రీలోను ఈ బ్యూటీపై ఒక లుక్ ఉంది. అందువల్లనే కాస్త ఆలస్యమైనా ‘చెక్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
నితిన్ హీరోగా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ‘చెక్’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో నితిన్ జోడీగా ప్రియా ప్రకాశ్ వారియర్ మెరవనుంది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ ను చూస్తే ఈ అమ్మాయి కాస్త కండపట్టి బాగానే ఉందనిపించింది. ‘భీష్మ’ హిట్ తో మంచి జోరుమీదున్న నితిన్ సరసన ఛాన్స్ దక్కించుకోవడం మామూలు విషయమేం కాదు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఈ సినిమా, ఈ నెల 26వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో ఈ పిల్ల టాలీవుడ్లో నిలదొక్కుకుంటుందేమో చూడాలి.
Must Read ;- ఫిబ్రవరి 19న ‘చెక్’ పెట్టడానికి రెడీ అవుతోన్న నితిన్











