ఒకరేమో స్టార్ డాటర్ మంచు లక్ష్మి. మరొకరు కుర్రకారు రక్తాన్ని మరిగించే అందాల హీటర్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఇద్దరూ కలిస్తే అల్లరికి హద్దే ఉండదు.. అందాలకు కొదవే ఉండదు. రీసెంట్ గా ఈ ఇరువురు ఓ నాటీ ఫోటో షూట్ చేశారు. రకరకాల పోజులతో పోటీ పడ్డారు. అందులో రకుల్ ప్రీత్ .. తెల్ల ఫ్యాషన్ దుస్తుల్లో అప్సరసలా మెరిసిపోతే .. మంచు లక్మి .. పింక్ టాప్ తో కూడిన ట్రెండీ డ్రెస్ లో ఆకట్టుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నిజానికి మంచు లక్ష్మి, రకుల్ స్రీత్ సింగ్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి వెకేషన్స్ కి, డివోషనల్ టూర్స్ కి, అకేషనల్ టూర్స్ కి వెళ్తూ ఉంటారు. మంచు మనోజ్ కరెంట్ తీగె సినిమాలో .. రకుల్ మెరుపు తీగెలా నటించినప్పటి నుంచీ మంచు లక్ష్మి తో ఆమెకి విడదీయరాని బంధం ఏర్పడింది. అది అనుబంధం గా మార్పు చెందింది. రకుల్ ఎప్పుడు హైద్రాబాద్ వచ్చినా.. మంచు లక్ష్మిని కలవకుండా వెళ్ళదు.
ఆ మధ్య డ్రగ్స్ స్కామ్ లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించినప్పుడు.. సోషల్ మీడియాలో రకుల్ పై బోలెడన్ని విమర్శలు , ట్రోల్స్ తలెత్తాయి. ఆ టైమ్ లో ఆమెకు అండగా నిలబడి.. నెటిజెన్స్ కు సరైన సమాధానం చెప్పింది మంచు లక్ష్మి. అప్పటి నుంచి రకుల్ కు మంచు లక్ష్మి మీద మరింత ప్రేమ, గౌరవం పెరిగాయి. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ .. మంచు లక్ష్మితో ఇంకెన్ని నాటీ పనులు చేస్తుందో చూడాలి.
Must Read ;- లేత సొగసులతో మతులు పోగొడుతున్న రకుల్











