మళయాళీ జనానికి ఓనం ఓ పెద్ద పండుగ. ఇలాంటి సమయంలోనే సినిమాలను ప్రత్యేకంగా విడుదల చేస్తుంటారు. ఈసారి థియేటర్లు లేకపోవడంతో ఓటీటీ వేదికలుగా విడుదలైన సినిమాల్లో ఒకటి ‘మానియారయిలే అశోకన్ ’ సినిమా. వివాహాలకు సంబంధించి వధూవరుల జాతకాల్లో దోషం ఉంటే అరచెట్టును పెళ్లిచేసుకున్న తర్వాత అసలు పెళ్లి చేసుకోమని చెప్పటం సర్వసాధారణంగా జరుగుతుంది. ఇది ఆ తరహా కథే.
మళయాళీలు కథకి ఏదీ అనర్హం కాదన్నట్లు సినిమాలు తీస్తారు. ఒక్కోసారి కామెడీ కోసం కామన్ సెన్స్ లేకుండా సినిమాలు తీస్తుంటారు. అయితే వాళ్ళ కన్విక్షన్ మెచ్చుకోదగ్గది. హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా ఈ సినిమా తీయడం, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించడమే కాదు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేయడం ఈ సినిమా మరో విశేషం.
కథేంటి? : కథ విషయానికి వస్తే అశోకన్(గ్రెగరీ) అనే ముదిరిపోయిన బ్రహ్మచారి ప్రతిరోజూ పెళ్లి గురించి, కాబోయే భార్య గురించి కలలు కంటూ ఉంటాడు. పెళ్లి చూపులకి వెళ్తే అమ్మాయిలు అతన్ని రిజెక్ట్ చేస్తుంటారు. చివరకి శ్యామా (అనుపమా పరమేశ్వరన్ ) అనే అమ్మాయి అశోకన్ ని ఇష్టపడుతుంది. తీరా పెళ్లి చేసుకుందాం అనుకునేటప్పటికి అశోకన్ కి కుజ దోషం ఉందని బయట పడుతుంది.
శ్యామా దుబాయ్ సంబంధం చేసుకుంటుంది. అశోకన్ తన కుజ దోషం పోవాలని ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా అరటి చెట్టుని రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. చెట్టును కూడా భార్యలాగే ప్రేమిస్తుంటాడు. అతని విపరీత చేష్టలకి తల్లి, స్నేహితులు కూడా భయ పడుతుంటారు. పెళ్లి చేసుకోమంటే తనకు పెళ్లయిపోయిందని, పిల్లలు ఉన్న వాడినని చెబుతుంటాడు అశోకన్. చివరకు అశోకన్ పిచ్చి ఎలా తగ్గింది? పెళ్లి అయిందా లేదా అనేది క్లైమాక్స్.
ఎలా తీశారు? : ఏ కథని సినిమాగా తీసినా జనం చూస్తారు అనుకోవడం పొరపాటు. అసలు ఇలాంటి కథలు ఎలా రాస్తారు? ఎలా తీస్తారు? ఎలా చూస్తారని జనం అనుకుంటారో అర్ధం కాదు. ఓనం పండగ కానుకగా నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. ఇంత కష్టపడి ఈ రివ్యూ రాయడానికి కారణం దయచేసి ఈ సినిమా చూసి మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. మీ మైండ్ అంత కన్నా ఖరాబు చేసుకోవద్దు.
తారాగణం : జాకబ్ గ్రెగొరీ, అనుపమ పరమేశ్వరన్ , నాజ్రియ నజిమ్ , అను సితార , లక్ష్మి శ్రీ, , కృష్ణ శంకర్, షైన్ టామ్ చాకో, శ్రిత శివదాస్ తదితరులు.
సాంకేతిక వర్గం : మ్యూజిక్ : శ్రీ హరి కే . నాయర్, డైరెక్టర్; శంబు జాయిబా
ప్రొడ్యూసర్: దుల్కర్ సల్మాన్, జాకబ్ గ్రెగొరీ
వేదిక: నెట్ ఫ్లిక్స్
రేటింగ్: 1.5/5
ఒక్కమాటలో: చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.
– గాదె సాయి కృష్ణ