మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్. మలినేని గోపీచంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రవితేజ – శృతిహాసన్ జంటగా నటించిన క్రాక్ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ట్రైలర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. అలాగే ఈమధ్య కాలంలో ఆడియన్స్ లో క్రేజ్ తీసుకువచ్చిన రవితేజ మూవీ అంటే అది క్రాక్.
దీంతో టీమ్ అంతా క్రాక్ సక్సస్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రమోషన్లో స్పీడు పెంచారు. రవితేజ సైతం మీడియాకి ఇంటర్ వ్యూలు ఇస్తూ.. క్రాక్ ని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. రీసెంట్ గా క్రాక్ గురించి తదుపరి సినిమాల గురించి రవితేజ స్పందిస్తూ.. క్రాక్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ మూవీ. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవన్నీ ఉంటాయి. కథ విషయానికి వస్తే.. సేతుపతి కథేనా ఇది అని అడుగుతున్నారు కానీ.. కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా మా డైరెక్టర్ రాసుకున్న కథ ఇది.
ఎవరికైనా డౌట్ ఉంటే.. ఆ యధార్థ సంఘటనలు ఏంటో.. ఆ రియల్ మనుషులు ఎవరో కూడా మా డైరెక్టర్ చెబుతాడు అన్నారు. మారుతితో సినిమాని వదిలేసారని తెలిసింది కారణం ఏంటి అని అడిగితే.. మారుతి అంటే చాలా ఇష్టం. అతనితో ఖచ్చితంగా సినిమా చేస్తాను. అయితే.. ఎప్పుడు అనేది తర్వాత చెబుతాన్నారు. ఈవిధంగా మాస్ మహారాజా మారుతితో సినిమాని ఎందుకు వదిలేసారో చెప్పకుండా తెలివిగా తప్పించుకున్నారు. ప్రస్తుతం ఖిలాడి సినిమా షూటింగ్ జరుగుతుంది. నక్కిన త్రినాధరావుతో సినిమాకి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి అని చెప్పారు అదీ.. మేటరు.
Must Read ;- సంక్రాంతి బరి నుంచి రవితేజ, రామ్ మధ్య పోటీ తప్పిందా?