‘ఎక్స్ పైరీ డేట్’ .. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ పేరిది. మానవ సంబంధాలకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని తెలియజేప్పే ప్రయత్నాన్ని దర్శకుడు శంకర్ కె. మార్తాండ్ చేశారు. ఇంతకీ ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా.. ఆయనకు క్రైమ్, థ్రిల్లర్, కామెడీ తరహా సినిమాలంటే ఇష్టమట. అలాంటి సినిమాలనే ఎక్కువగా చూస్తుంటారట. హిందీలో 2008లో వచ్చిన‘రేస్’ సినిమా ఆయన మనసులో బాగా ముద్ర వేసిందట. పైగా ఆయనకు అబ్బాస్ – మస్తాన్ ల దర్శకత్వ శైలి, వారు కథ చెప్పే విధానం బాగా ఇష్టమట. ఆ ప్రభావంతోనే తను ఇలాంటి కథ తయారు చేసుకోవలసి వచ్చిందని శంకర్ మార్తాండ్ చెప్పారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఆయన మీడియా ఇంటరాక్షన్ లో ఇంకా ఏమేం విశేషాలు చెప్పారో చూద్దాం.
* మేము వెబ్ సిరీస్ ప్రారంభించే సమయానికి తెలుగులో వెబ్ సిరీస్‌లు తీస్తున్నవాళ్ల సంఖ్య తక్కువ. కానీ, ఇంగ్లిష్‌లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటివి వచ్చాయి. హిందీలోనూ కొన్ని వచ్చాయి. మనం కొన్ని చూసి అలాంటివి చేస్తే బావుంటుందని అనుకుంటాం. ఆ సమయంలో ఓ నిర్మాత వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నారని తెలిసినవాళ్లు చెప్పారు. నా దగ్గర ఉన్న కథల్లో ఓ కథ చెప్పాను. నాకు థ్రిల్లర్స్, ఫాంటసీ చిత్రాలంటే ఇష్టం. ప్రేక్షకులు బయట ప్రపంచం మర్చిపోయేలా వాళ్ళకు థ్రిల్ ఇవ్వడం ఇష్టం. ఈ కథ చెప్పగానే ఆ నిర్మాతలు నచ్చిందన్నారు. అయితే, చేయడం కుదరలేదు. తర్వాత నిర్మాత శరత్ మరార్ దగ్గరకు వెళ్లాను. ఈ కథ చెప్పగానే ఆయన ఓకే అన్నారు. ‘జీ 5’ సౌతిండియన్ క్రియేటివ్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయల ప్రోత్సాహాన్ని మరువలేను.
* నా బ్యాడ్ టైమ్ కు ఎక్స్ పైరీ డేట్ వచ్చేసింది. అది పోవడం వల్లే ఇలాంటి వెబ్ సిరీస్ చేయగలిగాను. నాకు క్రైమ్ అండ్ కామెడీ ఇష్టం. అలా ఈ కథ తయారు చేసుకున్నా. కేవలం వెబ్ సిరీస్ కోసమే రాసుకున్న కథ ఇది. అబ్బాస్ – మస్తాన్ ల ఫార్మాట్ లో చేశా. ‘ఎక్స్ పైరీ డేట్’ చూసి అందరూ ఎక్సైట్ అవుతున్నారు
* సినిమాకీ వెబ్ సిరీస్ కీ ప్రధాన తేడా ఏమిటంటే సినిమా అనేది రెండు గంటల్లో ముగుస్తుంది. మొత్తం ఫోర్ బ్యాంగ్స్ తో కథని ముగించేయవచ్చు. వెబ్ సిరీస్ అలా కాదు. దీన్నొక ఛాలెంజ్ గా తీసుకోవాలి. ప్రతి ఎపిసోడ్ లోనూ ప్రేక్షకుడిని హోల్డ్ చేయగలగాలి. అందువల్ల ప్రతి ఎపిసోడ్ లోనూ అలాంటి బ్యాంగులూ, ముగింపులో ట్విస్టులూ ఉండాలి.
* జీ5 ప్రసాద్ గారికి ఈ సబ్జెక్ట్ బాగా నచ్చింది. ఇందులో అవసరమైన అన్ని ట్విస్టులూ ఉంటాయి. చూశాక ప్రసాద్ గారే ‘కొత్తగా ట్రై చేశావ్ ’ అంటూ నన్ను మెచ్చుకున్నారు.
* ఈ నెల 2 నుంచి హిందీలోనూ, 9 నుంచి తెలుగులోనూ రిలీజైంది. ఈ సిరీస్ కు సౌత్ ఇండియా నుంచి బ్యాంగ్ వచ్చింది.
* సినిమా అనేది మా కుటుంబంలో ఓ భాగం. అది నా జీవితంలోనూ భాగమైపోయింది. నా జీవితంలోకి ఏది వస్తే దాన్ని ఆహ్వానిస్తా. సినిమా చేయాల్సిన అవకాశం వస్తే చేస్తా. ప్రస్తుతానికి రెండు, మూడు వెబ్ సిరీస్ అవకాశాలు ఉన్నాయి.
* ఈ నటీనటుల ఎంపిక కూడా తమాషాగానే జరిగింది. హిందీలో కూడా చేయాలనుకున్నాం కాబట్టి దీని నిర్మాణ వ్యయం పెరిగింది. ఓటీటీ వేదికలు మనం పని చేసేటప్పుడు నటీనటులు ఎవరెవరిని తీసుకుంటున్నామనేది ముందుగా చెప్పాలి. ‘ఎక్స్‌పైరీ డేట్’లో టోనీ లూక్ చేసిన పాత్రకు ఎవరైతే బావుంటారని డిస్కషన్లు జరుగుతున్నాయి. సరిగ్గా అదే రోజున ఓటీటీలో ‘బద్లా’ విడుదలైంది. నేనది చూశా. టోనీ లూక్ బావుంటాడనిపించింది. రెండో రోజు శరత్ మరార్‌గారి చెప్పా. ఆయన కూడా ‘బద్లా’ చూశాననీ, టోనీ లూక్ బావుంటాడని అనిపించిందనీ చెప్పారు. అతడిని ఫైనలైజ్ చేశాం. స్నేహా ఉల్లాల్ వెబ్ సిరీస్‌లు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. ఆమెకు కథ చెప్పగా ఓకే అన్నారు. కథ అనుకున్నప్పుడు మధు షాలినీని ఎంపిక చేశాం. ‘జీ 5’ వాళ్లు కూడా మేం ఎంపిక చేసిన నటీనటులను ఓకే చేశారు.











