మెగా డాటర్ నిహారిక పెళ్లి ఈ రోజు. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి ఈరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయ్ పూర్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. గత మూడు రోజుల నుంచి మెగా ఫ్యామిలీ అంతా ఉదయ్ పూర్ కు చేరుకుని సందడి సందడి చేస్తున్నారు. మెగా హీరోలు అందరూ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. కాబోయే జంట చైతన్య, నిహారికలతో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా స్టెప్పులు వేసి పెళ్లి వేడుకల్లో జోష్ నింపారు.

చిరు స్టెప్పులు వేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. నిహారిక పెళ్లికి ఎప్పుడు వస్తారు.. అని ఎదురు చూసారు. ఆయన రైతు దీక్షలో పాల్గొన్నారు. దీంతో పవన్ నిహారిక పెళ్లికి వెళతారా.? వెళ్లారా.? అని అభిమానులు ఎదురు చూసారు. అయితే.. ఆఖరికి నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ ఉదయ్ పూర్ చేరుకున్నారు. పవన్ తో పాటు కొడుకు అకిరా నందన్, కూతురు ఆద్య కూడా పెళ్లికి వెళ్లారు. పవన్ నిహారిక పెళ్లికి రావడంతో నాగబాబు తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
Must Read ;- అందరి చూపులు నిహారిక కొణిదెల వివాహ వేడుకపైనే!

ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే.. ది లాస్ట్ పీస్ ఆఫ్ హ్యాపీనెస్ ఏరీవ్డ్ టూ అంటూ పవన్ కళ్యాణ్ తో నాగబాబు ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లిలో అన్నయ్య చిరంజీవిని, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసిన ఫోటోలు, పెళ్లికొడుకు చైతన్య, పెళ్లికూతురు నిహారికలతో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read ;- నాడు అమ్మ కట్టిన చీరతో.. నేడు పెళ్లి కూతురైన నిహారిక











