కొణిదెల నీహారిక.. తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మెగా అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన ఈ మెగా డాటర్ మెల్లగా వెండితెరకు పరిచేయమయ్యింది. చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ అమ్మడు. అయితే నిహారిక మెగా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అనుకున్న సమయంలోనే పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.
గత ఏడాది ఉదయ్పుర్ కోటలో నిహా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నీహారిక పెళ్ళికి ఆమె అన్నయ్య, హీరో వరుణ్ తేజ్ సుమారు రెండు కోట్ల వరకు ఖర్చు చేశారని టాక్. మెగా ఫ్యామిలీ, బంధువులతో పాటు వరుడు చైతన్య , ఆయన ఫ్యామిలీ వారి దగ్గరి బంధువులు సమక్షంలో నిహా , చైతు ల పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది.
అంతా బాగానే సాగుతోంది అనుకున్న సమయంలో నిహారికా వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొద్ది రోజులుగా నిహా ,చైతుల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని.. దీంతో వీరు వారి పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై అటు నిహారికా కానీ, ఆమె భర్త కానీ ఏమీ స్పందించకపోవడం, దానికి తోడు ఎప్పుడూ ఇన్ స్టాగ్రాంలో యాక్టివ్ గా ఉండే నిహారికా..ఇటీవల తన ఇన్స్టా అకౌంటును డీ యాక్టివ్ చేయడంతో.. ఈ రూమర్స్ నిజమే అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారట.
అయితే కొద్దిరోజుల ఈ నిహా భర్త చైతన్య ఈ పుకార్లకు చెక్ పెట్టె ప్రయత్నం చేశాడు.తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నామని తెలియజెప్పేలా నిహారికా ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు. ఆ తర్వాత కూడా ఇటువంటి వార్తలే తెగ హాల్ చాల చేస్తుండడంతో వీటికి నిహా కూడా వీటికి చెక్ పెట్టె ప్రయత్నం చేసింది. అందులో భాగంగా భర్త చైతన్య తో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన భర్త చైతుకి ముద్దుపెడుతున్న సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసిన నిహా “మా బంధం శాశ్వతమైంది.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను చైతన్య” అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ కూడా జోడించింది.
దీంతో గతకొన్ని రోజులుగా నిహారికా విషయంలో వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. నోటికొచ్చినట్లు మాట్లాడే వారికి సరైన సమాధానం చెప్పావు నిహారికా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.