డిసెంబర్ 9వ తేదీన మెగా డాటర్, నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం చైతన్య జొన్నలగడ్డతో జరిగిన విషయం తెలిసిందే. ఉదయపూర్ ప్యాలస్ లో జరిగిన ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు, అల్లు ఫ్యామిలీ హాజరైయ్యారు. వీరితో పాటు అతి కొంతమంది సన్నిహితుల సమక్షంలో నిహారిక – చైతన్య వివాహం జరిగింది. కోవిడ్ కారణంగా 120మంది అతిధులను మాత్రమే ఆహ్వానించారు. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
పెళ్లిలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సరదాగా గడిపారు. ముఖ్యంగా సంగీత్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా పాటలకు మెగా హీరోలందరూ స్టెప్స్ వేసి సందడి చేశారు. చిరు తన సతీమణి సురేఖతో వేసిన డాన్స్ సంగీత్ కే హైలైట్ గా నిలిచింది. పెళ్లి దుస్తులలో నిహారిక, చైతన్యలు యువరాజు, యువరాణి లా మెరిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిహారిక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Must Read ;- మెగా డాటర్ నిహారిక పెళ్లి చీరపై సోషల్ మీడియాలో రచ్చ
అంతేకాకుండా ఒక ఫొటోకు ‘నేను నిన్ను నవ్వించే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోను (కొట్టడంలో కూడా వదులుకోను)’ అని తన ఇన్ స్టాగ్రామ్ లో చిలిపిగా వ్రాసింది నిహారిక. ఇక బిందెలో నుండి ఉంగరాలు తీసిన మరో ఫోటోను పోస్ట్ చేస్తూ ‘నా అభిమానులను నేను గర్వ పడేలా చేశాను’ అని వ్రాసుకు వచ్చింది నిహారిక. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులతో పాటుగా వందలాది మంది నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆమె వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నారు.
Also Read ;- ఒక్క వీడియోతో సస్పెన్స్ లో పడేసిన అఖిల్. ఇంతకీ.. ఏంటది..?