ఈ నెల 9వ తేదీన మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక వివాహం ఉదయపూర్ ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహం మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు అతి కొంత మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, బన్నీ, రామ్ చరణ్, వరుణ్ తేజ్ సాయిధరమ్ కుటుంబ తదితరులు పెళ్ళికి రెండు రోజుల ముందే ఉదయపూర్ చేరుకోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం తన కొడుకు అకీరాతో వివాహానికి ఒక్క రోజు ముందు హాజరైయ్యారు.

Must Read ;- నిహారిక, చైతన్యలది.. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా?
సంగీత్ తో మొదలైన ఈ వేడుక కోసం ఎంత చెప్పినా తక్కువే. అలాగే మెగా కుటుంబ హీరోలందురూ ఒక్క చోట చేరి సందడి చేయడంతో వారి అభిమానులు ఈ పెళ్లి కోసం గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రస్తుతం నిహారిక కట్టుకున్న పెళ్లి చీర ఖరీదుపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిహారిక కట్టుకున్న చీర అక్షరాల 20లక్షలు ఖరీదంట. పెళ్ళికి సుమారు 40రోజుల ముందే ఆర్డర్ ఇచ్చారని సమాచారం. అత్యంత ఖరీదైన చీరను బంగారు తీగలతో తయారు చేశారట.
సినిమాలకు అలాగే సినీ ప్రముఖుల వస్త్రాలకు డిజైన్ చేసే వ్యక్తితో చీరను తయారు చేయించారని తెలుస్తోంది. ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె కట్టుకున్న చీర కోసం తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ 2కోట్లు విలువు చేసే బంగారు ఆభరణాలు. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ఒక స్థలం ఇచ్చారని వార్తలు వచ్చాయి. మెగా ఫ్యామిలీ మొత్తం కలిపి ఇచ్చిన బహుమతుల విలువ సుమారు 5కోట్లు విలువ చేస్తాయని టాక్ నడుస్తోంది. తన కూతురు పెళ్లి కోసం నాగబాబు కూడా 3కోట్లు వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. పెళ్లి పనులన్నీ వరుణ్ తేజ్ స్వయంగా చూసుకున్నారు.
Also Read ;- హైదరాబాద్ లో ఘనంగా నిహారిక చైతన్య రిసెప్షన్











