ప్రస్తుతం ‘ఆచార్య, ఆర్.ఆర్.ఆర్’ సినిమాల షూటింగ్స్ లో ఎడతెరిపి లేకుండా పాల్గొంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో స్వయంగా తెలియచేశారు. తనకి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిందని, కానీ ఎలాంటి సింప్టమ్స్ లేవని, ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నానని.. త్వరలోనే కోలుకుంటానని, మరింత బలవంతుడనై తిరిగి వస్తానని ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతేకాదు..గత రెండు, మూడు రోజులు తన తో కలిసి ట్రావెల్ చేసినవారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తానని చెప్పారు.
Must Read ;- మెగాస్టార్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్?
Request all that have been around me in the past couple of days to get tested.
More updates on my recovery soon. pic.twitter.com/lkZ86Z8lTF— Ram Charan (@AlwaysRamCharan) December 29, 2020











