జర్నలిస్ట్ లకు ఎంతో గౌరవం ఇచ్చి .. వాళ్ళను తన మనుషులుగా భావించడంలో మెగాస్టార్ చిరంజీవి తర్వాతే ఎవరైనా. అలాగే.. ఎవరికైనా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉండే హీరో కూడా ఆయనే. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఆరోగ్యం సరిగా లేని జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని చిరంజీవి పరామర్శించి ఆత్మీయంగా పలకరించారు. ఆయన అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
రామ్మోహన్ నాయుడి కి ఆరోగ్యం బాగోలేదని తెలిసిన వెంటనే… ఆయన ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పి.. ఆయన్ను అన్ని విధాలుగానూ ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు ..సిటీలోని ఏఐజీ హాస్పిటల్ లో మంచి ట్రీట్ మెంట్ ఇప్పించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. రామ్మోహన్ నాయుడు నీతి, నిజాయితీగాల జర్నలిస్ట్ అని .. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పెట్టే వ్యక్తని ఈ సందర్భంగా ఆయన్ను ప్రశంసించారు చిరు.