అక్కినేని నాగార్జున ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా అద్భుతంగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’. తాజాగా విడుదలైన ఈ సినిమా హైద్రాబాద్ లో 2007 లో జరిగిన వరుస బాంబ్ పేలుళ్ళ నేపథ్యంలో రూపొందింది. అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. రిలీజైన రోజు నుంచి మంచి టాక్ తో దూసుకుపోతున్న ‘వైల్డ్ డాగ్’ మూవీని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. అనంతరం ఈ సినిమా కథాంశాన్ని, టీమ్ వర్క్ ను, నాగ్ నటనను ఎంతగానో ప్రశంసించారు. ఆ సినిమా పై తన అభిప్రాయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశారు. అలాగే.. ఈ రోజు జరిగిన వైల్డ్ డాగ్ మూవీ సక్సెస్ మీట్ లో కూడా చిరంజీవి వైల్డ్ డాగ్ సినిమా గురించి, అందులో పనిచేసిన ప్రతీ టెక్నిషియన్ ప్రతిభా, పాటవాల్ని ఎంతగానో ప్రశంసించారు. అలాగే.. నాగ్ నటనకు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు.

ఇక చిరంజీవి .. ట్విట్టర్ లో సినిమా గురించి చాలా ఉద్వేగంగా స్పందించారు. ‘వైల్డ్ డాగ్’ మూవీ చూశాను. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుక ఉన్న కిరాతకుల్ని పట్టుకొన్న ఆ ఆపరేషన్ ను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ ఆవేశాన్ని, ప్రాణాలకు తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోల్ని, ఆ రియల్ హీరోల్ని మరింత అద్భుతంగా.. నా సోదరుడు నాగార్జున, వైల్డ్ డాగ్ టీమ్ ను, దర్శక నిర్మాతల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రతివారం విడదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు, ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగువారు గర్వంగా చూడాల్సిన చిత్రం. డోంట్ మిస్ దిస్ వైల్డ్ డాగ్ .. వాచ్ ఇట్ .. అంటూ చిరు వైల్డ్ డాగ్ సినిమాను, టీమ్ వర్క్ ను ఆకాశానికెత్తేశారు.
Must Read ;- ‘వైల్డ్ డాగ్’ మూవీ రివ్యూ











