మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మెహన్ రాజా దర్శకుడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ చేశారు. అయితే.. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ముందుగా రారాజు అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత అటు బైరెడ్డి, బిగ్ బ్రదర్, అంటూ రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఆతర్వాత ఈ సినిమాకు కింగ్ మేకర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే.. ఇటీవల గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని గట్టిగా వినిపించింది. అనుకున్నట్టుగానే ఆఖరికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్ ను చిరంజీవి పుట్టినరోజుకు ఒక రోజు ముందుగానే ప్రకటించారు. చిరు ఇమేజ్ కి తగ్గట్గుగా గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టడంతో ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి ముందుగా సుజిత్, సుకుమార్, వినాయక్.. ఇలా కొంత మంది దర్శకులను అనుకున్నప్పటికీ.. ఫైనల్ గా తమిళంలో ఎన్నో సినిమాలతో ప్రూవ్ చేసుకున్న తెలుగువాడైన మోహన్ రాజాకు అప్పగించారు.
ఇక మోహన్ రాజా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీగా మార్పులు చేర్పులు చేశారని.. అభిమానులకు పండగే అనేలా కథను మార్చారని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
Must Read ;- మెగాస్టార్ కొత్త సినిమాల ఇంట్రస్టింగ్ టైటిల్స్ ఇవే











