మూడు దశబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను మకుటం లేని మహరాజులా ఏలిన మెగాస్టార్ చిరంజీవి పాక శాస్త్రంలోనూ ప్రవీణుడనే సంగతి అందరికీ తెలిసిందే. తన లోని వంటల టాలెంట్ ను అప్పుడప్పుడూ పరిచయం చేస్తూ అభిమానులను మంత్రముగ్దుడ్ని చేస్తుంటాడు. హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ చట్నీస్ లో చిరంజీవి స్టీమ్ దోశ చాలా స్పెషల్. ఈ దోశకు రెస్పి కూడా చిరంజీవి చెప్పిందనే సంగతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. లాక్ డౌన్ సమయంలో ఇంటివద్దనే ఉంటున్న చిరు కొన్ని రోజుల కిందట తన తల్లి అంజని దేవికి పెసరెట్లు వేశారు. దోశ చేసిన విధానం ఒక ఎత్తయితే ఆ దోశ పెనాన్ని చిరంజీవి ఫ్లిప్ చేసిన పద్దతిని చూస్తే చిరంజీవి నల భీముడితో పోల్చవచ్చు.
చిరంజీవి గతంలో ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో చేపల కూర.. మటన్ వేపుడు చేయడానికి ఇష్టపడతానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ చెప్పిన విధంగానే ఆదివారం తన తల్లి కోసం చిరు చేపల కూర చేశాడు. ఈ వీడియోని ఆదివారం విడుదల చేస్తానని ప్రకటించాడు. కానీ విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో ఈ వీడియోని ఆదివారానికి బదులుగా సోమవారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. చెప్పినట్లే ఈ రోజు ఆ వీడియోని విడుదల చేశాడు. వాటిని ఎంతో నేర్పుగా చింత తొక్కుతో చిన్న చిన్న చేపలను వేపుడు చేసి తల్లికి వడ్డించారు. తన కోసం తనయుడు చేసిన వంటను ఆ మాతృమూర్తి ఎంతో సంతోషంగా తిన్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ ల పెళ్ళి లొల్లి..
సినీ ఇండస్ట్రి.. హాట్ రూమర్స్ ,అఫ్ఫైర్స్ ,లవ్ అఫైర్స్ కి కేరాఫ్ గా...