సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది దీనికి ట్యాగ్ లైన్. మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చాలా భాగం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంది. ముంబాయిలో కరోనా కేసులు ఎక్కువ ఉండడంతో హైదరాబాద్ లో షూటింగ్ చేయాలి అనుకున్నారు. ఇక్కడ కూడా కరోనా కేసులు పెరగడం.. లాక్ డౌన్ పెట్టడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది.
ఇప్పుడు కరోనా తగ్గడంతో షూటింగులు స్టార్ట్ చేస్తున్నారు. త్వరలో లైగర్ తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జాకీచాన్ చిత్రాలకు వర్క్ చేసిన ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ సారధ్యంలో స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రంలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే మైక్ టైసన్ ఓ సంచలనం. అప్పటి వరకు ఏ బాక్సర్ సాధించని ఎన్నో రికార్డును సృష్టించాడు.
అయితే.. 1997లో ఆయన ఆవేశంతో తోటి బాక్సర్ హోలీఫీల్డ్ చెవి కొరకడంతో బాక్సింగ్ నుంచి సస్పెండ్ అయ్యారు. బాక్సింగ్ చరిత్రలో సెన్సేషనల్ గా మిగిలిపోయిన టైసన్ ను లైగర్ చిత్రంలో నటింపజేయాలని అనుకుంటున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మేటర్ ఏంటంటే.. సంవత్సరం క్రితమే కరణ్ జోహార్ బృందం టైసన్ ను సంప్రదించారని తెలిసింది. తాజా వార్త ఏంటంటే.. ఇప్పుడు ఈ సినిమాలో నటించేందుకు మైక్ టైసన్ ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై విజయ్ కానీ పూరి కానీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా ఐదవ స్థానంలో యంగ్ హీరో