సాధారణంగా రైజింగ్ లో ఉన్న హీరోయిన్స్ .. నెగెటివ్ రోల్స్ జోలికి పోరు. అలాగే.. వ్యాంప్ తరహా పాత్రలు కూడా ముట్టుకోరు. అయితే ఈ రెండింటినీ ఒకే సినిమా కోసం మిక్స్ చేసి ఆ పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. అమ్మడి డేరింగ్ డెసిషన్ కు షాక్ తింటున్నారు టాలీవుడ్ జనం. అదే సమయంలో హీరోయిన్ గా తన కెరీర్ ను బాగానే లాగిస్తోన్న తమన్నాకి.. అలాంటి రోల్స్ చేయాల్సిన ఖర్మేం పట్టిందని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ హిట్టు మూవీ అంధాధున్ రీమేక్ వెర్షన్ కోసం టబు పాత్రను తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 2, సైరా నరసింహారెడ్డి’ సినిమాల సక్సెస్ తో ఉత్సాహంగా ఉన్న తమన్నా.. ప్రస్తుతం సీటీమార్, బోలే చూడియన్ హిందీ మూవీ, దటీజ్ మహాలక్ష్మి సినిమాలతో బిజీగా ఉంది. మరికొన్ని సినిమాలు లైన్ లో ప్లానింగ్ లో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో అమ్మడు అంధాధున్ మూవీలో నటిస్తోందనగానే.. ఆమె కెరీర్ రాంగ్ రూట్లో వెళుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఒక పోలీసర్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. హీరోని చంపాలని చూసే క్రూరమైన పాత్రను చేయాలని తమన్నా ఎలా అనుకుందని ఆశ్చర్యపోతున్నారు.
హిందీలో నటించిన టబు .. హీరోయిన్ గా చేయడం మానేసి చాలా కాలమైపోయింది. అందుకే టబు ఇప్పుడు కేరక్టర్ రోల్స్ లోకి మారింది. ఆమె వ్యాంప్ పాత్ర చేసిందంటే.. ఒక అర్ధముంది. కానీ ఆ పాత్రను తమన్నా లాంటి హీరోయిన్ చేయడం ఆమెకే రిస్క్ అని డిస్కస్ చేసుకుంటున్నారు. నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మరి ఈ సినిమాతో తమన్నా మంచి పేరు తెచ్చుకుంటుందా? లేక ప్రేక్షకుల విమర్శలకు గురి అవుతుందా అనేది చూడాలి.