ఇప్పటికే తాను అంగీకరించిన సినిమాలలో కావలసినంత నటనను పలికించగల పాత్రలు లభించాయట ముందు ముందు చేయబోయే సినిమాలోని పాత్రలు కూడా పదికాలాల పాటు నటిగా గుర్తు పెట్టుకునేలా ఉండాలని ఆమె కోరుకుంటోంది. “దటీజ్ మహాలక్ష్మి” చిత్రం విడుదలలో జాప్యం చోటు చేసుకున్నప్పటికీ, ఇందులో నటనా పరంగా తనకు మంచి మార్కులే పడతాయని ఆమె భావిస్తోంది. ప్రస్తుతం తెలుగులో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సిటీమార్” చిత్రంలో గోపీచంద్ సరసన ఆమె నటిస్తోంది.

నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న “గుర్తుందా శీతాకాలం” చిత్రంలోను, ఇంకా హిందీ నుంచి తెలుగులోకి రీమేక్ కానున్న “అంధధూన్” చిత్రంలోను తమన్నా నటిస్తోంది. హిందీలో టబు చేసిన పాత్రకు నటనా పరంగా చాలా పేరొచ్చింది. టబు చేసిన పాత్రనే తెలుగులో తమన్నా చేయనుందట. ఆ పాత్రకు జీవం పోసేలా తన నటనా పఠిమను చూపాలని ఆమె కంకణం కట్టుకుందట ఇక ఆయుష్మాన్ ఖురానా చేసిన పాత్రను నితిన్ పోషిస్తారు. గ్లామర్ పాత్రలో నభా నటేష్ సందడి చేయనుంది. వీటి సంగతి ఇలావుంటే..బాలీవుడ్లో “బోలే చుడియాన్” చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది. మొత్తం మీద తాను అనుకుంటున్నట్లుగా నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలే తనకు లభిస్తుండటం ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.
Must Read ;- నయనానందం .. నాజూకు భామల సోయగం











