నేతన్న నేస్తం కార్యక్రమంలో కనపడని ఆప్కో ఛైర్మెన్.
ఇంఛార్జ్ రేసులో ముందుడటమే చిల్లపల్లి మోహన్ రావు చేసిన పాపమా.
పీకే టీం సర్వే లో ఒకటో స్థానంలో ఉండటంతో ఆప్కో ఛైర్మెన్ ని టార్గెట్ చేసిన ఆర్కే.
తండ్రి చనిపోయినప్పుడు సజ్జల లాంటి పెద్ద నాయకులు వచ్చినా నివాళులర్పించడానికి మొహం చాటేసిన ఆర్కే.
మంగళగిరి రాజకీయం వేడెక్కుతుంది ఎన్నికలు దగ్గర పడుతుండటంతోవైసిపి లో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. పీకే టీం సర్వే ఆర్కే టీం కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంఛార్జ్ రేసులో చిల్లపల్లి మోహన్ రావు ముందు ఉన్నారనే వార్త ఆర్కే జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళగిరిలో నిర్వహించిన నేతన్న నేస్తం కార్యక్రమం మరోసారి వైసిపి అంతర్గత విబేధాలను బయటపెట్టింది. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఆర్కే పార్టీలో తాను వ్యతిరేకిస్తున్న ఎవరిని పిలవలేదు. ముఖ్యంగా చేనేత కార్యక్రమానికి ఆప్కో ఛైర్మెన్ సొంత నియోజకవర్గం వ్యక్తి అయినా పిలవకపోవడం రాజకీయవర్గాల్లోనూ, వైసిపి నాయకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కనీసం ఈ కార్యక్రమానికి చిల్లపల్లి మోహన్ రావు కి కనీసం ఆహ్వానం లేకపోవడం పార్టీలో నెలకొన్న విబేధాలకు అద్దంపడుతుంది. ఇటీవల చిల్లపల్లి మోహన్ రావు తండ్రి చనిపోయిన సంధర్భంలో కూడా ఆర్కే గౌరవప్రదమైన నివాళులర్పించకపోవడం, పార్టీ క్యాడర్ ఎవరు అటువైపు చూడకుండా చెయ్యడం లాంటి అంశాలు వీరిద్దరి మధ్యా ఉన్న గ్యాప్ ని తెలియజేస్తున్నాయి. చిల్లపల్లి కి డైరక్ట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు ఉండటం కూడా ఆర్కే తట్టుకోలేకపోతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పోరాడింది నేను ఆ రోజు సజ్జల ఎక్కడ ఉన్నారు అంటూ ఆంతరంగికులతో ఆర్కే అనడం మరింత చర్చకు దారితీస్తుంది. సజ్జల మంగళగిరి లో ఏ కార్యక్రమానికి వచ్చినా దానికి ఆర్కే దూరంగా ఉండి కేవలం అధికారులను మాత్రమే పంపుతున్నారు. పార్టీ క్యాడర్ ని కూడా సజ్జల కార్యక్రమానికి పంపకపోవడం పట్ల సజ్జల అనుచరులు గుర్రుగా ఉన్నారని అందులో భాగంగానే ఆపరేషన్ మంగళగిరి స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. నెలకున్న అంతర్గత విభేదాలు, మరోపక్క ఇంఛార్జ్ మార్పు కోసం పీకే టీం చేస్తున్న సర్వే మంగళగిరి లో రాజకీయ హీట్ పెంచుతుంది.