మంగళవారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కన్నబాబుకు ఎదురుదెబ్బ తప్పలేదు. ఎన్నకలకు ముందు ప్రచారంలో నిర్వహణలో భాగంగా రాజకోడూరు, వెల్చూరు పంచాయతీ వీఆర్ అగ్రహారంలో బెదిరింపులకు పాల్పడిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేశాయి. దీంతో ఎమ్మెల్యే గారి బాగోతంపై రాష్ట్రమంతా బాగానే చర్చ నడిచింది. ఎన్నికల ఫలితాల అనంతరం అందరి దృష్టి కన్నబాబు ప్రచారం చేసిన ఊళ్లలో ఎవరు గెలిచారా అని ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. కన్నబాబుకు ప్రజలు గట్టి షాకిచ్చారనే చెప్పాలి.
రాజకోడూరులో ఎమ్మెల్యే బలపరిచిన చిరంజీవిపై వైసీపీ తిరుగుబాటు అభ్యర్థి ముత్తా శంకరరావు విజయం సాధించారు. ఇక అయితే వెల్చూరులో కన్నబాబు బలపరిచిన అనకాపల్లి సీతపై ప్రత్యర్థి వర్గానికి చెందిన కిల్లాడ మంగాయమ్మ విజయం సాధించారు. కన్నబాబు నోటిదురుసు తనానికి ప్రజలు తగినరీతిన బుద్ది చెప్తారని ఈ ఘటనను చూస్తే అర్ధమవుతుంది.