విలక్షణ నటుడు మోహన్ బాబు 69 ఏళ్లు నిండి 70 వసంతాలలోకి అడుగుపెట్టబోతున్నారు. 1952 మార్చి 19న మోహన్ బాబు పుట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కామన్ డీపీని ఈరోజు విడుదల చేశారు. ప్రస్తుతం ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా చేస్తున్నారు. ఇటీవల సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందే ‘శాకుంతలం’లోనూ నటిస్తున్నారు. ‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక కథా చిత్రాన్ని రూపొందించిన గుణశేఖర్ ఇప్పుడు ‘శాకుంతలం’ రూపొందిస్తున్నారు. ఇందులో దూర్వాస మహాముని పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్ నిర్మిస్తున్నారు. ఇందులో ఆయన పోషించేది లేనిది అధికారిక ప్రకటన రేపు వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం మోహన్ బాబు చిత్రాల జాబితా కూడా రాబోతోంది. ఆయన సమకాలికులాంతా సినిమాల స్పీడు పెంచారు. మామూలుగానే మోహన్ బాబుకు స్పీడు ఎక్కువ. ఇక సినిమాల స్పీడు పెరగకుండా ఎలా ఉంటుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కూడా వరసగా సినిమాలు చేస్తున్నారు. ఈ విషయంలో మోహన్ బాబు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి ఉండదు. ఒకవిధంగా చిరంజీవికన్నా వయసులోనూ, నటనా రంగంలోనూ మోహన్ బాబే సీనియర్.
Must Read ;- దూర్వాస మహామునిగా మోహన్ బాబు ?
The man of discipline and golden heart ❤️
Maa nanna 🤗
Manandari pedarayudu 🤗
Common DP for @themohanbabu garu's birthday 🎂🎉🥳#HappyBirthdayMohanBabu garu#MB #MohanBabu pic.twitter.com/1XFXFuNR1Z— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 18, 2021