మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ .. రీసెంట్ గా ‘దృశ్యం 2’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు నెలల్లో ఆయన నటించిన మరో క్రేజీ మూవీ ‘మరక్కార్ : ది అరబ్బిక్కడలిండే సింహం’ విడుదలకాబోతోంది. అలాగే.. ఆయన మరో సినిమా ‘రామ్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో అందాల త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవన్నీ ఒకెత్తైతే.. మోహన్ లాల్ మొదటి సారి గా దర్శకత్వం వహించబోతున్న ‘బరోజ్’ మూవీ ఇంకో ఎత్తు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నారు మోహన్ లాల్. కొచ్చి కాక్కనాడ్ నవోదయ స్టూడియో లో జరుగుతోన్న ప్రీప్రొడక్షన్ వర్క్ లో హీరో పృధ్విరాజ్ కూడా పాల్గొంటున్నాడు. బరోజ్ సినిమాకి సంబంధించిన సెట్ డిజైన్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్ ప్రొడక్షన్, త్రిడీ వర్క్ దాదాపు ఒక సంవత్సరం నుంచి ఇక్కడే జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకూ వేరే సినిమాలో నటించకూడదని మోహన్ లాల్ నిర్ణయించకున్నారు.
పోర్చుగీస్ నేపథ్యంలో రూపొందనున్న పీరియాడికల్ మూవీ బరోజ్. నాలుగు వందల సంవత్సరాల నుంచి వాస్కోడిగామా నిధికి కాపాలాగా ఉంటోన్న భూతం పేరు బరోజ్. వాస్కోడిగామా అసలైన వారసుల కోసం ఎదురు చూస్తున్న బరోజ్ ను వెతుక్కుంటూ ఓ కుర్రోడు వస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటన్నది మిగతా కథ. ఇందులో బరోజ్ అనే భూతం పాత్రను మోహన్ లాల్ ను పోషిస్తుండగా.. మరో ప్రధానపాత్రలో పృధ్విరాజ్ నటిస్తున్నాడు. భారతీయ సినిమా చరిత్రలో తొలి త్రిడీ చిత్రానికి రచన అందించిన జీజో బరోజ్ మూవీకి కూడా పనిచేస్తున్నాడు. సంతోష్ శివన్ ఈ సినిమాకి సినిమా టో గ్రఫీ అందిస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో ఆంటనీ పెరుంబావూర్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న బరోజ్ .. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.
Must Read ;- ‘దృశ్యం 3’ కి ఆస్కారముందా?