ఈ జెనరేషన్ లో ఇండియా వైజ్ గా ది బెస్ట్ అనిపించుకున్న హీరోల్లో మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒకరు. తన తండ్రిలాగానే ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో మెప్పించే టాలెంట్ అతడిది. ఎర్లియర్ గా కనులు కనులను దోచాయంటే మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన దుల్కర్.. ఇప్పుడో పాన్ ఇండియా మూవీతో భారతీయ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా పేరు ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో ఈ క్రైమ్ బయోపిక్ రూపొందుతోంది.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం త్వరలో థియేటర్స్ లో సందడి చేయబోతోంది కురుప్ సినిమా. ఇందులో తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ కథానాయికగా నటిస్తోంది. ఎయిటీస్ లో కేరళ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నేరస్తుడు సుకుమార కురుప్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అచ్చం తనలాగే ఉండే చాకో అనే ఓ అమాయకుడ్ని కారుతో సహా దహనం చేసేసి.. హత్యచేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటికీ కేరళ పోలీసులు అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు.
సుకుమార కురుప్ పాత్రను దుల్కర్ సల్మాన్ చేస్తుండగా.. చాకోగా టావినో థామస్ నటిస్తున్నాడు. ఇంకా ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్, నన్నీ వెయిన్ , షైన్ టామ్ చాకో, మనోజ్ బాజ్ పాయ్, సురేశ్ ఒబెరాయ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వే ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈనెల 26న కురుప్ టీజర్ .. అన్ని భాషల్లోనూ విడుదల కాబోతోంది. వాస్తవ సంఘటనకి సినిమా టిక్ డ్రామా జోడించి.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. మరి ఈ సినిమా దుల్కర్ కు ఏ రేంజ్ లో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Also Read : దుల్కర్ సల్మాన్ సరసన అందాల రాశి.. నిజమేనా?