ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘పుష్ఫ’. పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 13న విడుదల కాబోతోంది.
ఇక ఈ సినిమా కోసం సుకుమార్ వివిధ భాషల నుంచి నటీనటుల్ని ఎంపిక చేశారు. ముఖ్యంగా విలన్ గా మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ .. స్మగ్లర్ గా నటిస్తుండగా.. బన్నీ లారీ డ్రైవర్ గా వైరెటీ మేకోవర్ తో ఆకట్టుకోబోతున్నాడు.
ఇక ఈ సినిమా లో తన పార్ట్ షూట్ కోసం ఫహద్ ఫాజిల్ సెట్స్ లో అడుగుపెట్టారు. అలాగే.. ఆయన భార్య నజ్రియా నజీమ్ సైతం నానీ సినిమా అంటే సుందరానికీ మూవీ సెట్స్ లో అడుగుపెట్టింది. ఇలా భార్యాభర్తలిద్దరూ తొలిసారిగా నటిస్తున్న తెలుగు సినిమా కోసం ఒకేసారి షూటింగ్స్ లో జాయిన్ అవడం విశేషంగా మారింది. మరి పుష్ఫ సినిమా ఫహద్ ఫాజిల్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- ‘పుష్ప’ సినిమాకోసం రంగంలోకి దిగిన ఆస్కార్ విజేత











