సాధారణంగా.. అందం కన్నా అభినయానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మల్లూ ముద్దు గుమ్మలు. ఎన్ని కోట్లిచ్చినా.. సిల్వర్ స్ర్కీన్ కి ఎక్కువగా తమ అందాల్ని ధారాదత్తం చేయరు. అయితే ఇప్పటి తరంలో కొందరు మలయాళ బ్యూటీస్ మాత్రం బోల్డ్ గా నటించడడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. అలాంటి వారి లిస్ట్ లో కి కొత్తగా సానియా అయ్యప్పన్ అనే బ్యూటీ వచ్చి చేరింది. మాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది. ఇప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి.. అద్భుత పెర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే సానియా అయ్యప్పన్ కేవలం బెస్ట్ పెర్ఫార్మర్ మాత్రమే కాదు.. అవసరముంటే గ్లామర్ ను కూడా ఒలకబోయగలదు. ముఖ్యంగా బోల్డ్ పాత్రలు చేయడంలో ఆమె స్పెషలిస్ట్. త్వరలో కొన్ని మలయాళ సినిమాల్లో సానియా .. కొన్ని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పాత్రలు చేయబోతోంది. ఇక అమ్మడికి ఇన్ స్టా ఖాతాలో హాట్ ఫోటోస్ పోస్ట్ చేయడం కూడా చాలా ఇష్టం. ఆమెకు సోషల్ మీడియాలో బోలెడు ఫాలోయింగ్ ఉంది. లేటెస్ట్ గా ఆమె మల్దీవ్స్ ను సందర్శించి.. అక్కడ సాగరతీరంలో హాటుగా హాయిగా సేదదీరింది. ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోసే దీనికి నిదర్శనం.

బీచ్ ఒడ్డున ఇసుకతిన్నుల్లో నల్ల బికినీతోనూ. నీలి సంద్రంలో నీలం రంగు బికినీలోనూ దర్శన మిచ్చింది. అలాగే.. ఇసుకతిన్నెల్లో నిలబడి క్లీవేజ్ షో కూడా చూపరుల్ని మత్తెక్కిస్తోంది. ఈ ఫోటోస్ కు ప్రస్తుతం సోషల్ మీడియాలో బోలెడంత రెస్సాన్స్ వస్తోంది. ఆమె అందాల విన్యాసాలకు .. అవకాశాలు బాగానే వస్తాయనిపిస్తోంది. మన తెలుగు దర్శకులు కానీ.. ఆమెను అలా చూస్తే చాలు.. ఏదో సినిమాలో అమ్మడికి ఛాన్స్ ఇవ్వడం ఖాయం. మరి సానియా అయ్యప్పన్ కు తన హాట్ నెస్ ఎంత అడ్వాంటేజ్ కానుందో చూడాలి.










