బిగ్ బాస్ 4 నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? టాప్ 5 లిస్టులో ఉండేది ఎవరు?.. ఇదే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. వచ్చే వారమే బిగ్ బాస్ ఫైనల్ జరగబోతోంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం మోనాల్ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటిదాకా ఏదో అదృశ్యశక్తి ఆమెను రక్షిస్తూ వచ్చింది. ఈసారి కూడా ఆ అదృశ్య శక్తి ఆమెను రక్షిస్తుందని అందరూ అనుకున్నారుగానీ అలా జరగలేదు. ఆమె ఎలిమినేషన్ అనివార్యమైంది. బిగ్ బాస్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తిగా మారింది.
సోషల్ మీడియాలో అయితే.. బిగ్ బాస్ విన్నర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎవరికి తోచినట్టుగా వాళ్లు లెక్కలేస్తూ.. విన్నర్ ఎవరో చెబుతున్నారు. అలాగే తమ ఫేవరేట్ కంటెస్టంట్ కి సపోర్ట్ చేస్తూ.. ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇది సోషల్ మీడియాలో ఉండే యూత్ మాత్రమే చేస్తున్నారు అనుకుంటే పొరపాటే. సినీ తారలు సైతం బిగ్ బాస్ విన్నర్ గురించి తమ అభిప్రాయాలను చెబుతూ.. ఫేవరేట్ కంటెస్టంట్ ఎవరో చెబుతూ సపోర్ట్ చేస్తున్నారు.
Must Read ;- బిగ్ బాస్ 4 విజేత ఎవరో బయటపెట్టిన అవినాశ్..
అఖిల్ ఇప్పటికే ఫైనల్ లిస్ట్ లో చేరాడు. ఇక శనివారం జరిగిన షోలో ఫైనల్ కి చేరిన మరో కంటెస్టెంట్ ఎవరో తెలియచేశారు. ఆసక్తిగా సాగిన ఈ ఎపిసోడ్ లో సోహైల్ ఫైనల్ కి చేరాడని ప్రకటించారు. దీంతో అఖిల్, సోహైల్ ఫైనల్ కి చేరారు. ఇక మిగిలింది అభిజిత్, అరియానా, హరిక, మోనాల్. వీరిలో అభిజిత్ స్ట్రాంగ్ కంటెస్టంట్. అందువల్ల అభిజిత్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అరియానా విషయంలోనూ డేంజర్ బెల్స్ గట్టిగానే వినిపించాయి. ఈసారి కూడా ఆమె బయటపడింది.
ఆమె ఎలిమినేషన్ లో లేకపోవడంతో మిగిలింది హరిక, మోనాల్.. ఈ ఇద్దరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు రానున్నారన్న టాక్ వినిపించింది. హరిక సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయి మోనాల్ మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలిసింది. ఎట్టకేలకు మోనాల్ కథ ఇలా ముగిసిందని అనుకోవచ్చు. టాప్ 5 విషయానికి వస్తే అగ్రస్థానంలో అభిజిత్ నిలుస్తాడు. రెండో స్థానంలో అరియానా, మూడో స్థానంలో సోహైల్, నాలుగు స్థానంలో అఖిల్, ఐదో స్థానంలో హారిక నిలుస్తారు.
Also Read ;- బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ కు ఈ స్టార్ హీరో వస్తాడా?











