‘హాయ్.. ఐయామ్ హర్ష.. ఒకబ్బాయ్ లైఫ్ లో ఫిప్టీ పర్సంట్ కెరీర్.. ఫిఫ్టీ ఫర్సంట్ మ్యారీడ్ లైఫ్. కెరియర్ ని సూపర్ గా సెట్ చేసుకున్నాడు. ఈ మ్యారీడ్ లైఫే.. ఇదిగో ఇలా.. అయ్యయయ్యయో’.. అంటూ అటూ ఇటూ వణికిపోయాడు.
మరి అఖిల్ ఎందుకలా అన్నాడన్న ఆసక్తిని దర్భకుడు బొమ్మరిల్లు భాస్కర్ క్రియేట్ చేశారు. ఇంతకుముందే ప్రీ రిలీజ్ టీజర్ విడుదలైంది. దీని కోసమే అఖిల్ ఇలా ఓ వీడియో చేసి ముందుకు వదిలాడు. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ లో హర్షగా అఖిల్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రీ టీజర్ ఈరోజు విడుదలైంది. అసలు హిట్లు ఖాతాలో వేసుకోలేకపోతున్న అఖిల్, వరుస హిట్లతో దూసుకుపోతున్న పూజా హెగ్డే ఇందులో ఎలా కనిపించబోతున్నారో మరి.
మొన్న పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదలైంది. స్టయిలిష్ గా ఉన్న పూజ కాలేజీ అమ్మాయి అనేది ఆ లుక్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక అఖిల్ బ్యాచ్ లర్ గా కనిపిస్తున్నాడు కాబట్టి అతను కూడా కాలేజీ కుర్రాడే అనుకోవాలేమో. బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు, వాసు వర్మ సయుక్తంగా నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా ఈ మధ్య హిట్లు పడలేదు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేసే దిశగా నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ఆమని, మురళీ శర్మ కీలకలు పాత్ర పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 25న టీజర్ కూడా రిలీజ్ కాబోతోంది.











