మలయాళ కుట్టి నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు ఎట్టకేలకు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. ఏడేళ్ళ పాటు ప్రేమాయణం సాగించన ఈ జంట కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ లవర్స్ అనిపించుకున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రేమను పెళ్లిగా మలుచుకునేందుకు సిద్ధం అయ్యారు.జూన్ 9 వ తేదీన వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. తొలత వీరు తమ వివాహాన్ని తిరుపతిలో చేసుకోవాలని అనుకున్నప్పటికీ.. ఫైనల్ గా వివాహ వేదికను మహాబలిపురంకి మార్చుకున్నారు.
2015లో మొట్టమొదటి సారిగా ‘నానుమ్ రౌడీ దాన్’ (నేనూ రౌడీనే) చిత్రం సెట్లో నయన్ , విఘ్నేష్ లు ప్రేమలో పడ్డారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ తర్వాత ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం బయటపడింది.గత సంవత్సరమే ఈ ఇద్దరికీ నిశ్చితార్ధం జరిగినప్పటికీ విషయాన్ని బయటకు పొక్కనీకుండా ఇద్దరూ జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, ఇప్పుడు ఏకంగా పెళ్ళి చేసుకుంటున్నట్టు ప్రకటించి వీరు తమ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చారు. అదేసమయంలో పెళ్ళి శుభలేఖను కూడా వీరు ఎంతో వెరైటీగా డిజైన్ చేయించారు.
ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ శివన్ ల పెళ్ళి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తం డిజిటల్ ఫార్మేట్ లోనే ఆహ్వాన పత్రికను డిజైన్ చేయడం విశేషం. పెళ్ళి కార్డ్ లో నయన్ అండ్ విక్కీ అని సింపుల్ గా వీరిద్దరి పేర్లూ కనిపిస్తున్నాయి. మోషన్ పోస్టర్ స్టైల్లో రివీలవుతున్న ఈ శుభలేఖకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయ్ సేతుపతి, సమంత, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తదితర కోలీవుడ్ సినీ ప్రముఖులు ఈ పెళ్ళికి రాబోతున్నారని టాక్.
ఇదిలా ఉంటే ఇప్పటికే నయనతార తమిళంలో ‘ఓ2’ , అజిత్ 62వ చిత్రంలోనూ, మలయాళంలో పృధ్విరాజ్ హీరోగా ‘గోల్డ్’ అనే మూవీలోనూ, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలోనూ నటిస్తోంది. కాగా పెళ్ళి తర్వాత నయన్ మళ్ళీ వెండితెరపైకి ఎప్పుడు తిరిగి వస్తుంది అనే అంశం ప్రస్తుతం ఆస్కాటికరంగా మారింది.