మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడూ కోరుకుంటారు. ఆ అద్భుతమైన అవకాశం ఎప్పుడు వస్తుందా అని కలలు కంటారు. అలా.. కల కన్న దర్శకుల్లో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఒకరు. అయితే.. ఆయన కల త్వరలోనే నిజం కాబోతోంది. అవును.. మెగాస్టార్ చిరంజీవిని సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాట్లాడేందుకు మెగాస్టార్ చిరంజీవిని సుకుమార్ కలిశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
ఈ వార్త నిజంగానే సర్ ఫ్రైజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే.. చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా.. వెంకీ కుడుములతో ఓ సినిమా చేయనున్నారు. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న చిరంజీవితో సుకుమార్ సినిమా అనగానే అభిమానులే కాదు ఇండస్ట్రీలోనే జనాలు సర్ ఫ్రైజ్ ఫీలవుతున్నారు. మరో వైపు సుకుమార్ కూడా పుష్ప 2తో ఫుల్ బిజీ. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సి ఉంది.
రీసెంట్‌గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు సుకుమార్. అంతకుముందు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో రంగస్థలం వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్‌ను చిరంజీవి సుకుమార్ డైరెక్ట్ చేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
అయితే.. చిరంజీవి నటిస్తున్న ఓ యాడ్ ని సుకుమార్ డైరెక్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే.. చిరు, సుకుమార్ కాంబినేషన్లో యాడ్ రానుందా..? మూవీ రానుందా..? అనేది తెలియాల్సి ఉంది.