అవికాగోర్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు నుంచే ఈ అమ్మాయి పాపులర్. ఇక కథానాయికగా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తూనే వరుస హిట్లు కొట్టేసింది .. యూత్ నుంచి వీలైనన్ని మనసులను మూటగట్టేసింది. తెలుగులో మంచిగా క్రేజ్ పెరుగుతూ ఉన్న సమయంలోనే ఈ అమ్మాయి ఒక్కసారిగా ఇక్కడి నుంచి మాయమైంది. ఆ తరువాత తెలుగు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా మొక్కుబడిగా ఒక సినిమా చేసిందిగానీ అది పెద్దగా ఆడలేదు.
అలాంటి ఈ అమ్మాయి మళ్లీ ఈ మధ్య ఇన్ స్టా ద్వారా ఒక్కో ఫొటో వదులుతూ వెళుతోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చిట్టి పొట్టి డ్రెస్ లో ఒక స్మైల్ విసిరింది. అయితే ‘ఉయ్యాలా జంపాలా‘ సినిమాలో చూసిన అవికాకు .. ఇక్కడ కనిపించే అవికాకు చాలా తేడా ఉంది. ఆ సినిమాలో ఈ అమ్మాయి బొద్దుగా ముద్దుగా ఉండేది. అవికాలో ప్ర్రత్యేకమైన ఆకర్షణ ఆమె కనుబొమల కలయిక. కుర్రాళ్లు ఆమెను ఎక్కువగా ఇష్టపడటంలో ప్రధానమైన పాత్ర ఆ కనుబొమల కలయికదే. కానీ ఈ ఫొటోలో ఆ బొద్దుతనం .. ఆ కనుబొమల కలయిక రెండూ మిస్సయ్యాయి.
అంటే అవికా తనలో ఏవి ప్రేక్షకులకు నచ్చాయో వాటికి గుడ్ బై చెప్పేసిందన్నమాట. అవికా బొద్దుగా ఉంటే అచ్చు వెన్నెల్లో చందమామలా ఉండేది .. ఆమె అందచందాలు తాకగానే తెలుగు తెర గోరింటాకులా పండిపోయేది. అలాంటి అవికా ఈ ఫొటోలో పీలగా కనిపిస్తోంది. హీరోయిన్లలో కొంతమంది సన్నబడిపోయి అవకాశాలను పోగొట్టుకున్నారు. మరికొంతమంది లావుగా మారిపోయి అవకాశాలు లేకుండా చేసుకున్నారు. ఎవరు ఎలా ఉంటే బాగుంటారో అలాగే ఉండటం మంచిదనే సత్యం చాలాసార్లు రుజువైంది. ‘చంద్రముఖి‘ సినిమాలో ‘నేను లావైతే బాగుండదు .. నువ్వు సన్నబడితే బాగుండదు” అని ప్రభుతో రజనీ చెప్పే డైలాగ్ లో నిజం లేకపోలేదు.
Must Read ;- అశ్లీల యాప్ లో తన ఫోటోలపై స్పందించిన పునర్నవి