వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు రాజధానుల్లోనూ ప్రజలు ముంచేశారు. ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని మావిగన్ స్లోగన్ అందుకొంటే.. ఆ మావిగన్ ఓటర్లు ఫ్యాన్‌ని మడతపెట్టేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో కూటమి పార్టీలు తిరుగులేని మెజారిటీతో ఘన విజయం సాధించాయి. వైసీపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. రాజధాని ప్రాంతంలోని మున్సిపల్ కార్పరేషన్లలో తీర్పు ద్వారా మావిగన్‌తో పాటు జగన్ విధానాలను ప్రజలు బలంగా తిరస్కరించారు.
మచిలీపట్నంలో టీడీపీ అభ్యర్ధి అబ్దుల్ అబిదా 32 వేల ఓట్ల తేడాతో మేయర్‌గా గెలుపొందారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన లక్ష్మీ అపర్ణ లక్షా ఐదు ఆధిక్యంతో విజయం సాధించారు. విజయవాడ నుంచి బరిలోకి దిగిన జనసేన అభ్యర్ధి వంగవీటి రాధా కృష్ణ లక్షా 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2029లో జరగబోయే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి నినాదంతోనే బరిలోకి దిగుతానని గతంలో జగన్ శపథం చేశారు. మావిగన్ కావాలో.. అమరావతి కావాలో ప్రజల ఓట్లే నిర్ణయిస్తామని చెప్పారు.
2029 మే వరకు ఆగాల్సిన అవసరం లేకుండా.. 2026 నవంబర్లోనే రాజధాని ప్రాంత ప్రజలు మావిగన్‌పై జగన్‌కి క్లారిటీ ఇచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలు ఏకపక్షంగా కూటమి పార్టీలను గెలిపించడం ద్వారా అమరావతికే మా ఓటు అని తేల్చి చెప్పారు. గతంలో మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే.. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు ఓటర్లు వైసీపీకి గట్టిగా బుద్ది చెప్పారు.
ఘోర పరాజయం తర్వాతైనా జగన్ తీరు మారుతుందని ఆశిస్తే.. మావిగన్ పేరుతో మరోసారి అవరావతిని నాశనం చేసే ప్లాన్‌తో ముందుకొచ్చారు. జగన్ విధ్వంసకరమైన ఆలోచలనలను రాజధాని ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఈ ఫలితాలు తాడేపల్లి ప్యాలెస్‌కి పెద్ద షాకిచ్చాయి. ఇంత దారుణమైన రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా జగన్‌లో మార్పు రాకపోతే.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీకి భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.











