టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించి అమరులైన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఎంపిగా తనకు అందిన మొదటి నెల జీతం మూడు లక్షల రూపాయలను ఆర్మీ జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా ఇచ్చారు. దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు.. విరాళం చెక్కును అందజేశారు.
మాతృభూమి రక్షణ కోసం సరిహద్దుల్లో కఠిన పరిస్థితుల్లో అహర్నిశలు శ్రమిస్తూ.. ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చింతకాయల విజయ్ చెప్పారు. తన వంతు బాధ్యతగా ఈ చిన్న సాయం చేసినట్లు వివరించారు. ఎంపీ పదవి చేపట్టిన తర్వాత వచ్చిన తొలి వేతనాన్ని సైనికుల కుటుంబాల కోసం ఇచ్చిన చింతకాయల విజయ్‌ని ప్రముఖులు, సామాన్యులు.. ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటు సమావేశాల్లోనే విజయ్ తన మార్క్ చూపిస్తున్నారు. కీలకమైన బిల్లులపై చర్చల్లో పాల్గొన్న చింతకాయల విజయ్.. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను సభ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. జాతీయ స్థాయిలో ఆంధ్రా వాయిస్ వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యని పెంచే బిల్లుపై మాట్లాడుతూ.. జగన్‌పై 30కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని కేస్ స్టడీగా తీసుకొని.. పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లుపై చర్య సందర్భంగా.. మావిగన్ పేరుతో ఏపీలో జరుగుతున్న వికృత రాజకీయాలను ఢిల్లీలో అందరికీ తెలిసేలా చేశారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన కేంద్రమే కాకుండా.. తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే పేరు. అలాంటి స్వచ్ఛమైన తెలుగు పేరుకి బదులు మావిగన్ అనే కొత్త వింత పేరుని తెరపైకి తీసుకొచ్చిన జగన్ విధానాలు దేశానికే ప్రమాదకరమని రాజ్యసభ వేదికగా ఎలుగెత్తారు. సభలో పదునైనా మాటలతో ఆకట్టుకోవడంతో పాటు.. తన తొలి జీతాన్ని అమర జవాన్ల కుటుంబాల సంక్షేమానికి ఇవ్వడం ద్వారా అందరి మనసులు గెలుచుకున్నారు ఎంపీ చింతకాయల విజయ్.











