ఏపీ సీఎం ఓ పిచ్చివాడని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుకలో ఎంత దోచారో,లిక్కర్‌లో ఎంత దోచుకుంటున్నారో త్వరలో లెక్కలతో సహా బయటపెడతానని ఆయన ఢిల్లీలో హెచ్చరించారు. కరోనాతో జనాలు చస్తూ ఉంటే సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆనందం పొందుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.జనాల చావు గంటలు జగన్‌రెడ్డికి చర్చి గంటల్లా వినపడుతున్నాయని రఘురామరాజు విమర్శించారు.తనపై సోషల్ మీడియాలో బూతులు పెట్టిస్తూ ఆనందం పొందుతున్నారని,తాను మరల వారిని తిడితే కేసులు పెట్టించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. అందుకే అలాంటి వారిపై ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టు రఘురామరాజు తెలిపారు.
కరోనా కట్టడితో జగన్ చేతులెత్తేశాడు
ఏపీలో కరోనా కట్టడిలో సీఎం జగన్ రెడ్డి చేతులెత్తేశాడని,కంపెనీలు తయారు చేసిన వాటిలో సగం వ్యాక్సిన్లు నేరుగా రాష్ట్రాలకు అమ్ముతున్నాకేవలం 12 లక్షల వ్యాక్సిన్లకే ఆర్డర్లు పెట్డడం మీ విఫలం కాదా అని ఆయన ప్రశ్నించారు.ఒక్క రాజమండ్రిలోని నగరపాలక సంస్థ స్మశాన వాటికకే నిన్న ఒక్క రోజులో 60 కరోనా శవాలు వచ్చాయని, కానీ సీఎం మాత్రం జిల్లాకు ఒకరిద్దరు చనిపోయినట్టు దొంగ లెక్కలు చెబుతున్నారని రఘురామరాజు తప్పుపట్టారు. ఏడాదిన్నరగా సీబీఐ కోర్టుకు హాజరు కాకుండా సీబీఐ చీఫ్‌తో సీఎం జగన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్సుల్లో మాట్లాడుతున్నారని,అవి కూడా త్వరలో బయటపెడతానని రఘురామరాజు చెప్పారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను కూడా మీడియాకు ప్రదర్శించిన రఘురామరాజు,తనపై సోషల్ మీడియాలో బూతులు పెడుతున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.











