నరసాపురం వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు ఇస్తే తీసుకోవాలని, అయితే డబ్బులు ఇచ్చిన వారికి మాత్రం ఓట్లు వేయవద్దని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విజ్ఙప్తి చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచడం, తీసుకోవడం నేరమని, అయినా కొందరు బలవంతంగా డబ్బులు పంచుతున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారంలో ఉన్న వారు దోచుకున్న డబ్బు పంచుతున్నారని, బలవంతంగా డబ్బులిస్తే తీసుకోవాలని అయితే వారికి మాత్రం ఓట్లు వేయవద్దని తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లకు విజ్ఙప్తి చేశారు.
వైసీపీ నేతలను ఉద్దేశించి చేసినవేనా..
రఘురామరాజు వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఉద్దేశించి చేసినవిగా తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉప ఎన్నికలకు ఓటుకు రూ.2 వేలు పంచుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు సీఎం ఆదేశాల మేరకు 5 లక్షల మెజారిటీ సాధించాలని పెద్ద ఎత్తున డబ్బు పంచుతున్నారని రఘురామరాజు అభిప్రాయపడ్డారు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికల్లోనే రూ.200 కోట్లు డబ్బు పంచే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఓటుకు రూ.2 వేలు ఇస్తున్నారని, ఈ మొత్తం ఎన్నికల నాటికి ఇంకా పెరగవచ్చన్నారు. డబ్బు తీసుకోండి, కానీ డబ్బిచ్చిన వారికి అమ్ముడు పోవద్దన్నారు.
Must Read ;- నా మీద ఈగ వాలితే నిన్ను జనం తొక్కేస్తారు .. జగన్‌పై ఎంపీ రఘురామరాజు ఫైర్











