ఏపీలో జరుగుతున్న అరాచకాలను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ప్రధాని మోడీని కలసి వివరించారు. రాజధాని మార్పు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయడం, దేవాలయాలపై దాడులు వంటి అనేక అంశాలను రఘురామకృష్ణంరాజు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచి, ప్రభుత్వ డబ్బుతో చర్చిల నిర్మాణం చేస్తోందని సాక్షాలతో సహా ప్రధాని మోడీకి, ఎంపీ రఘురామకృష్ణంరాజు వివరించారు. ఎంపీ చెప్పిన విషయంపై ప్రధాని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చర్చిలకు టెండర్లు పిలిచి ప్రభుత్వ డబ్బుతో నిర్మించడంపై మరిన్ని వివరాలు ఇవ్వాలని ఎంపీని ప్రధాని కోరినట్టు తెలుస్తోంది.
రాజధాని మారిస్తే ఏపీ నష్టపోతుంది..
రాజధానిగా ఉన్న అమరావతిని మారిస్తే ఏపీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందని ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రధాని మోడీకి వివరించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని, అయినా ఏపీ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఎంపీ ప్రధానికి తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మిగిలిన పరిశ్రమల మాదిరి కాదని తెలుగువారి పోరాటంతో ఏర్పడిన స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయవద్దని ప్రధానికి వివరించినట్టు ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. తాను చెప్పిన విషయాలన్నీ ప్రధాని మోడీ 18 నిమిషాలపాటు సావధానంగా విన్నారని ఎంపీ తెలిపారు.
Must Read ;- జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన రెబల్ నేత రఘురామ కృష్ణంరాజు