ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు.రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి సరిగ్గా ఇదే చేశారు. కోవిడ్ సేవలు అందిచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు,ఆక్సిజన్, మందులు కూడా లబించని క్లిష్ట సమయంలో సుజనా చౌదరి ఆపన్న హస్తం అందించారు.విజయవాడలో సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో సుజానా చౌదరికి చెందిన ది వెన్యూ ఏసీ ఫంక్షన్ హాలును 100 పడకల కోవిడ్ కేంద్రంగా మార్చారు.ది వెన్యూ ఏసీ ఫంక్షన్ హాలును ప్రభుత్వానికి అప్పగించి కరోనా రోగులకు వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ను ఎంపీ సుజనా చౌదరి కోరడంతో వెంటనే వారు రంగంలోకి దిగారు.ఫంక్షన్ హాలులో వంద పడకలతోపాటు ఆక్సిజన్ కూడా అందించే ఏర్పాట్లు పూర్తి చేశారు.శనివారం కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దివెన్యూ కోవిడ్ సెంటర్‌ను ప్రారంభించారు. దీంతో కరోనా రోగులకు ఆక్సిజన్‌తో కూడిన సేవలు ప్రారంభమయ్యాయి.కోవిడ్ రోగులకు ఎవరూ బస కల్పించేందుకు ముందుకు రాని సమయంలో తన ఏసీ ఫంక్షన్ హాలును కోవిడ్ కేంద్రానికి ఇవ్వడంపై పలువురు ప్రశంశలు కురిపిస్తున్నారు.
సరిహద్దుల్లో అంబులెన్సులకు లైన్ క్లియర్
తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను నిలిపివేయడంపై రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, తన న్యాయవాదుల ద్వారా హైకోర్టులో పిల్ వేయించారు.దీంతో తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపట్టిన హైకోర్టు, అంబులెన్సులు ఆపవద్దని ఆదేశించింది.దీంతో సుజనా కృషి ఫలించింది. దీంతో వందలాది మంది కరోనా రోగుల ప్రాణాలను నిలపగలిగారు.
Must Read ;- NHRC : కరోనా మృతులను గౌరవంగా సాగనంపండి