గత ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది… ఒకటీ రెండు నియోజకవర్గాలు మినహా.. ఎక్కడా టీడీపీ తన హవాని చాటలేకపోయింది.. అయిదేళ్లకే అక్కడ సీన్ మారినట్లు కనిపిస్తోంది.. 2024 ఎన్నికలలో టీడీపీ – జనసేన కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోవడం ఖాయమని తాజా రాజకీయ పరిణామాలు వెల్లడిస్తున్నాయని, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు..
ఉభయ గోదావరి జిల్లాలలో జగన్ వేసిన కాపు వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయిందని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.. ముఖ్యంగా జగన్.. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య ఫ్యామిలీని టీడీపీలోకి కోవర్టులుగా పంపాలని మొదట భావించారని, అది గ్రహించిన చంద్రబాబు – పవన్ అలెర్ట్ అవడంతో జగన్ ప్లాన్ వర్కవుట్ అవలేదనే చర్చ జరుగుతోంది.. దీంతో, ఉభయగోదావరి జిల్లాలలో ఎన్నికల నోటిఫికేషన్‌కి ముందే టీడీపీ – జనసేన తొలి విజయం సాధించాయని చెబుతున్నారు..
ముద్రగడ .. గత కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుని విమర్శిస్తున్నారు.. ఇటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా ఆరోపణలు గుప్పిస్తున్నారు.. జగన్ కాపులకి ఎలాంటి న్యాయం చేయకపోయినా, ముద్రగడ ఏ రోజూ ఆయనని పల్లెత్తు మాటనలేదు.. వైసీపీ సర్కార్ ఎన్ని తప్పులు చేసినా ముద్రగడ వ్యూహాత్మక మౌనముద్రను పాటిస్తారు.. ఇక, హరిరామ జోగయ్య వారసులు ఇద్దరూ వైసీపీలో చేరిపోయారు.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.. అయితే, రామజోగయ్య రాసే లేఖల వెనక ఆయన వారసులే ఉన్నారనే అనుమానాలు ఉన్నాయి.. ఇలాంటి జగన్ కోవర్టులను పార్టీలో చేర్చుకుంటే, టీడీపీ – జనసేనకి భారీ నష్టం అని గ్రహించిన చంద్రబాబు.. పవన్… వెంటనే వారికి చెక్ పెట్టారు..
వీరికి పార్టీలో చాన్స్ ఇస్తే.. ఉభయ గోదావరి జిల్లాలలో బీసీ సామాజిక వర్గాలు సైతం దూరం అవుతాయనే అభిప్రాయం ఉంది.. తాజాగా మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్‌పై అన్ని సామాజిక వర్గాల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.. అందుకే, ఎన్నో చర్చల తర్వాత పవన్ – చంద్రబాబు ఆ ఇద్దరికీ నో చెప్పారని సమాచారం. దీంతో, ఉభయ గోదావరి జిల్లాలలో ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే టీడీపీ – జనసేన కూటమి తొలి విజయం సాధించినట్లు చెబుతున్నారు ఎనలిస్టులు.. ముద్రగడ సైతం తమ ప్లాన్ వర్కవుట్ కాలేదని, ఇది ఆ రెండు పార్టీలకి కలిసి వస్తుందని చెబుతున్నారు. మరి, జగన్ దీనికి కౌంటర్‌గా ఏం చేస్తాడో చూడాలి..