వ్యాపారదిగ్గజం ముఖేష్ అంబానీ దంపతులు తాత, బామ్మలుగా ప్రొమోషన్ పొందారు. ముకేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ తండ్రయ్యాడు. శ్లోకా మెహతా మగ బిడ్డకు జన్మనిచ్చినట్లుగా అంబానీ కుటుంబం వెల్లడించింది. ముంబైలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో శ్లోకా, ఓ కుమారిడికి జన్మనిచ్చారని అధికారక ప్రకటన విడుదల చేశారు. తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేశారు. వారసుడి రాకతో అంబానీ ఇంట పండగ వాతావరణం నెలకొంది.
https://twitter.com/mukeshambani01/status/1336993603608952839?s=20
గత సంవత్సరం 2019, మార్చి 9 వ తేదీన అంగరంగ వైభవంగా ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతాల వివాహాం జరిగిన విషయం తెలిసిందే. శ్లోకా, భారతీయ వ్యాపార దిగ్గజం రసుల్ మెహతా కుమార్తె. ధీర భాయ్ కుటుంబానికి నవ శకానికి స్వాగతం అంటూ కుటుంబం ఉప్పొంగిపోతుంది.
Must Read ;- ‘ఈ సమయంలో నా భార్యతో ఉండడం ముఖ్యం’











