బిగ్ బాస్.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న పేరు ఇది. ఈ రియాల్టీ షో ఫైనల్ దగ్గరపడుతుండడంతో రోజురోజుకు విజేత ఎవరు అవుతారనే ఉత్కంఠ పెరుగుతుంది. అయితే.. బిగ్ బాస్ షోలో తన టాలెంట్ తో అందరి మనసులు దోచుకున్న అవినాశ్ తన మనసులో మాటలను బయటపెట్టారు. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్ వ్యూలో అవినాశ్ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా రాఘవపట్నం అనే చిన్న ఊరు. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా అటుపోట్లు ఎదుర్కొన్నానని చెప్పారు.
సినిమాలంటే ఇంట్రస్ట్ ఉండడంతో మిమిక్రీ నేర్చుకున్నాను. అలాగే చాలా స్టేజ్ షోలో చేసాను. అలా చేయడం వలనే ఈ రోజు ఈ స్ధాయిలో ఉన్నానన్నారు. బిగ్ బాస్ షో చూసిన వాళ్లు ఎవరైనా సరే.. అవినాశ్ కు, అరియానాకు మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటారు. దీని గురించి అవినాశ్ స్పందిస్తూ.. ఒకే ఇంట్లో నెలలు తరబడి ఉంటే.. అందులో ఎవరైనా నచ్చిన వాళ్లు ఉంటే.. ఇష్టపడడం సహజం అన్నాడు. అరియానాలో ముక్కుసూటితనం తనకు బాగా నచ్చిందన్నాడు. మరో విషయం ఏంటంటే.. అందరూ అరియానా గంభీరంగా ఉంటుంది అనుకుంటారు కానీ.. ఆమె చాలా సాఫ్ట్ అని చెప్పాడు.
బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారంటే.. అభిజిత్, అరియానా.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విన్నర్ అవుతారు. అయితే.. తన ఫ్రెండ్ అరియానా విన్నర్ అయితే హ్యాపీగా ఫీలవుతాను అంటూ తన మనసులో మాటలను బయటపెట్టాడు. బిగ్ బాస్ లోకి రావడం తన జీవితంలో ఓ మలుపు. ఈ షోకు వెళ్లడం ద్వారా బతుకు పాఠాలు నేర్చుకున్నాను. బిగ్ బాస్ మనల్ని గురించి మనం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి అద్భుతమైన అవకాశం అని చెప్పాడు. మరి.. అవినాశ్ చెప్పినట్టుగా అభిజిత్, అరియానా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారో..? లేక వేరే వాళ్లు విజేతగా నిలుస్తారో ఈ నెల 20న తెలుస్తుంది.
Must Read ;- బిగ్ బాస్ విషయంలో.. వర్మ శ్రీకాంత్.. ఇద్దరిలో ఎవరి జోస్యం ఫలిస్తుంది.?











